Warangal | BJP, BRS కుమ్మక్కు రాజకీయాలు: ర‌వి

Warangal దోపిడీ వర్గంతో సిపిఐ, సిపిఎం పొత్తులు ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వామపక్ష పార్టీలు బిఆర్‌యస్ వెంట పోతుంటే, బి ఆర్ యస్ మాత్రం బి జె పి వెంట పోతుందని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాదగోని రవి ఎద్దేవాచేశారు. వరంగల్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ విధానాన్ని ఎంసిపిఐ(యు) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. సిపిఐ, సిపిఎం అవకాశ వాద రాజకీయాలుమాని కమ్యూనిస్టు,వామపక్ష ఐక్యతకు ఎంసిపిఐ(యు) చేస్తున్న […]

  • Publish Date - July 9, 2023 / 12:11 PM IST

Warangal

  • దోపిడీ వర్గంతో సిపిఐ, సిపిఎం పొత్తులు
  • ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వామపక్ష పార్టీలు బిఆర్‌యస్ వెంట పోతుంటే, బి ఆర్ యస్ మాత్రం బి జె పి వెంట పోతుందని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాదగోని రవి ఎద్దేవాచేశారు. వరంగల్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ విధానాన్ని ఎంసిపిఐ(యు) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.

సిపిఐ, సిపిఎం అవకాశ వాద రాజకీయాలుమాని కమ్యూనిస్టు,వామపక్ష ఐక్యతకు ఎంసిపిఐ(యు) చేస్తున్న కృషితో కలిసి రావాలి అని పిలుపునిచ్చారు. తెలంగాణ లో సీఎం కేసిఆర్ కూతురు కవిత పై లిక్కర్ కేసు రాగానే బి ఆర్ యస్ నేతలు బిజెపి ముందు సాగిలపడిందని అంతకంటే ముందు బి ఆర్ యస్ తో సిపిఐ, సిపిఎం లు పొత్తులకు వెంపర్లాడటం ఎంత వరకు సమంజసం అని అన్నారు.

బీజేపీ విచ్ఛిన్న రాజకీయాలు

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రానున్న సాధారణ ఎన్నికల్లో లబ్ది కోసం దేశం లో రాజకీయ విచ్చిన్నతకు పాల్పడుతుందని రవి విమర్శించారు. దేశంలో రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేస్తూ, ఆ పార్టీలు నేతలపై ఈడిని , సిబిఐని, కోర్టులను ఉపయోగించి దాడులు చేస్తూ అవినీతి పరులని ముద్రలు వేస్తూ లొంగదీసుకుంటున్నదని మండిపడ్డారు.

వీరంతా బిజెపిలో చేరగానే పవిత్రులెలా అవుతున్నారని ప్రశ్నించారు. నిన్న మొన్న మహారాష్ట్రలో జరిగిన పరిణామాలు చూస్తే అర్థమవుతుందని అన్నారు. అప్రజాస్వామిక పద్దతుల్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం చూస్తుంటే బిజెపి అసహనం, అహంభావం స్పష్టంగా బయట పడుతున్నాయన్నారు.

ఇది ప్రజాస్వామిక, రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని అన్నారు. మణిపూర్ రావణా కాష్టం లాగా కాలుతున్నా ఆ శవాలపై తన రాజకీయ భవిష్యత్తు నిర్మాణం చేస్తున్నది బీజేపీ అంటూ విమర్శించారు.
పార్టీ ప్రజా సంఘాల నిర్మాణం బలోపేతం చేయడానికి జూలై 15,16 తేదీలలో నాగార్జునసాగర్ లో అన్ని ప్రజా సంఘాల రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, వస్కుల మట్టయ్య, గోనె కుమారస్వామి, ఎన్ రెడ్డి హంసారెడ్డి, మంద రవి, రాష్ట్ర కమిటీ సభ్యులు నర్ర ప్రతాప్, నాగెల్లి కొమురయ్య వంగల రాగసుధ తదితరులు పాల్గొన్నారు.

Latest News