Site icon vidhaatha

Warangal |ప్ర‌ధాని ప్ర‌త్యేకంగా క‌లిసిన ఈ వ‌రంగ‌ల్ యువ‌కుడు ఎవ‌రో తెలుసా?

Warangal

వరంగ‌ల్‌: వ‌రంగ‌ల్ (Warangal) ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ప్ర‌ధాని మోదీ (Modi) ఒక విశిష్ట వ్య‌క్తిని క‌లుసుకున్నారు. అత‌డు ఆటిజం (Autism) తో బాధ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ అద్భుత‌మైన గాత్రంతో అల‌రించే కామిశెట్టి వెంక‌ట్.

ఈ యువ‌కుడు నైపుణ్యానికి ప‌వ‌ర్‌హౌస్ లాంటి వాడ‌ని మోదీ అభివ‌ర్ణించారు. వైక‌ల్యం అత‌డిని ఆప‌లేక‌పోయింద‌ని కొనియాడారు. వెంక‌ట్‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకుని హ‌త్తుకున్నారు. అత‌డి పాట‌ను, నృత్యాన్ని చూసి వెన్నుత‌ట్టారు.

కామిశెట్టి వెంక‌ట్ ఒక ప‌వ‌ర్‌హౌస్‌. యువ‌శ‌క్తి, నైపుణ్యం అత‌డిలో న‌ర‌న‌రానా ఉన్నాయి. అద్భుతంగా పాడాల‌నే కోరిక‌ను ఆటిజం ఆప‌లేక‌పోయింది. నాటు నాటు పాట పాడ‌ట‌మే కాకుండా డ్యాన్స్ చేసి చూపించాడు. అత‌డికి నా సెల్యూట్ అని మోదీ ట్వీట్ చేశారు.

వామ‌ప‌క్ష తీవ్ర‌వాదం వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల‌ను శ‌నివారం తెల్ల‌వారుజామున మోదీ క‌లుసుకున్నారు. వ‌రంగ‌ల్‌లో వామ‌ప‌క్ష తీవ్ర‌వాదం వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల‌ను క‌లుసుకున్నాను. వారి కథ‌లు, వెత‌లు న‌న్ను క‌దిలించాయి. శాంతియుత‌మైన స‌మ‌స‌మాజాన్ని నిర్మించేలా వారు మాకు స్ఫూర్తి నింపారు అని ప్ర‌ధాని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Exit mobile version