Warangal
విధాత: వరంగల్ హాంటర్‌రోడ్డులో వరద బీభత్సం సృస్టిస్తోంది. అక్కడే ఉన్న ఇంటర్ గర్ల్స్ హాస్టల్ చూట్టూ నీరు భారీగా చేరుకుంది. దీంతో బయటకి రావడానికి వీలు లేకపోవడంతో భవనం ఎక్కిన విద్యార్థినులు, సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
హాస్టల్ బిల్డింగ్‌లో పూర్తిగా 270 మంది విద్యార్థినిలు ఉన్నారు. వరద ఉధృతి వేగంగా ఉండటంతో విద్యార్థినులను బయటకు తీసుకు రాలేక పోతున్నారు. దీంతో వారికి కావాల్సిన ఆహారాన్ని హాస్టల్ సిబ్బంది పడవల సహాయంతో తీసుకెళ్లి అందిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులకు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినులను పడవల ద్వారా బయటికి తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం, రెస్క్యూ టీం ప్రయత్నిస్తోంది.