Site icon vidhaatha

Warangal | వైద్యం కోసం హైదరాబాద్‌ పోవాల్సిన అవసరం లేదు: మంత్రి హరీష్ రావు

Warangal

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ నుండి హైదరాబాద్‌కి వైద్యం కోసం పోవాల్సిన అవసరం లేని విధంగా ఇక్కడ హెల్త్ సిటీ నిర్మాణ పనులు దసరా వరకు పూర్తి అవుతా యని రాష్ట్ర వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను బుధవారం పరిశీలించిన అనంతరం మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు.

హెల్త్ యూనివర్సిటీతో పాటు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వరంగల్‌లో ఉండడం గర్వకారణమన్నారు. నిమ్స్ లో, ఇతర కార్పొరేట్ హాస్పిటల్ లో ఎలాంటి అత్యాధునిక సేవలు ఉన్నాయో అవన్నీ వరంగల్ సూపర్ స్పెషలిటీలో అందనున్నాయన్నారు. పనులు వేగంగా జరగాలని ఎల్ అండ్ టీ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. వెయ్యి మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారని వివరించారు.

హాస్పిటల్ ను 2100 పడకలు వచ్చేలా డిజైన్ మార్పు చేశామన్నారు. ఇందులో 800 పడకలు సూపర్ స్పెషల్ బెడ్స్ ఉన్నాయని, 14 లక్షల ఎస్ఎఫ్టీ నిర్మాణం పూర్తయింది. దాదాపు 60 శాతం పనులు పూర్తయ్యాయి. 36 రకాల సేవలు అందిస్తామన్నారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా హాస్పిటల్ చుట్టూ
6 లైన్ రోడ్ నిర్మాణం చేపడుతూనే.. ఎమర్జెన్సీ సర్వీసుల కోసం అంబులెన్స్ లు ట్రామా కేర్ లోకి సులువుగా వెళ్ళే విధంగా ఉండేందుకు ప్రత్యేకమైన డెడికేటెడ్ రహదారి, ఎంట్రెన్స్ లు ఉంటాయన్నారు.

కిడ్నీ, లివర్ మార్పిడి చికిత్సలు

కిడ్నీ, లివర్ తదితర మార్పిడి చికిత్సలు జరిగినప్పుడు పేషంట్ బంధువులు ఉండేందుకు వీలుగా హాస్పిటల్ ఆవరణలో 250మంది ఉండే విధంగా అన్నీ సౌకర్యాలతో ధర్మా శాల నిర్మాణం ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు.

4800 కిలో వాట్స్ పవర్ సప్ప్లై కి అనుగుణంగా 6000 కిలో వాట్స్ సామర్ధ్యం గల జనరేటర్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 1200 కిలో లీటర్‌ల సామర్ధ్యంతో STP ప్లాంట్ ఏర్పాటు, 800కిలో లీటర్
వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు, 400 మంది రెసిడెంట్ డాక్టర్లకు స్పెషల్ రూమ్స్, 450మందితో సమావేశం పెట్టగలిగేలా కాన్ఫెరెన్స్ హాల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఉమ్మడి వరంగల్లో ఏడు మెడికల్ కాలేజీలు

రాష్ట్రం ఏర్పడిన నాడు ఒకే ఒక్క KMc ఉండేది.. ఈరోజు 7 మెడికల్ కాలేజీలు ఈ విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వస్తున్నాయని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఇంకా ఒక్కటి మెడికల్ కాలేజ్ ములుగు లో వచ్చే విద్య సంవత్సరానికి ఇవ్వబోతున్నామన్నారు. కాంగ్రెస్ నాయకులకు తెలివి లేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగుల వయస్సు పెంపు చట్టాన్ని గవర్నర్ తిరస్కరించడం బాధాకరమైన విషయం అన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version