Warangal | పారిశుద్ధ్య కార్మికులు దేశానికే ఆద‌ర్శం: మంత్రి ఎర్ర‌బెల్లి

Warangal సీఎం స‌మ‌యానుకూలంగా నిర్ణ‌యం తీసుకుంటారు.. ఎక్క‌డాలేని విధంగా కార్మికుల వేత‌నాలు పారిశుద్ధ్య కార్మికులు ఆందోళ‌న‌ విర‌మించాల‌ని సూచ‌న‌ క్షుద్ర రాజ‌కీయాల వ‌ల‌లో చిక్కుకోవ‌ద్దని.. రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌ మంత్రి ఎర్ర‌బెల్లి వినతి విధాత, వ‌రంగ‌ల్‌ ప్రత్యేక ప్రతినిధి: పారిశుద్ధ్య కార్మికులు ఎవ‌రి మాట‌లో విని ఆందోళ‌న‌లు చేయొద్దు. ఆగం కావ‌ద్దు.. సీఎం కెసిఆర్ మ‌న‌సున్న మ‌హ‌రాజు, త‌గిన స‌మ‌యంలో త‌గిన నిర్ణ‌యాలు తీసుకుంటారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా మ‌న పారిశుద్ధ్య కార్మికుల వేత‌నాలు ఉన్నాయి. దేశానికే […]

  • Publish Date - July 18, 2023 / 03:50 PM IST

Warangal

  • సీఎం స‌మ‌యానుకూలంగా నిర్ణ‌యం తీసుకుంటారు..
  • ఎక్క‌డాలేని విధంగా కార్మికుల వేత‌నాలు
  • పారిశుద్ధ్య కార్మికులు ఆందోళ‌న‌ విర‌మించాల‌ని సూచ‌న‌
  • క్షుద్ర రాజ‌కీయాల వ‌ల‌లో చిక్కుకోవ‌ద్దని..
  • రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌ మంత్రి ఎర్ర‌బెల్లి వినతి

విధాత, వ‌రంగ‌ల్‌ ప్రత్యేక ప్రతినిధి: పారిశుద్ధ్య కార్మికులు ఎవ‌రి మాట‌లో విని ఆందోళ‌న‌లు చేయొద్దు. ఆగం కావ‌ద్దు.. సీఎం కెసిఆర్ మ‌న‌సున్న మ‌హ‌రాజు, త‌గిన స‌మ‌యంలో త‌గిన నిర్ణ‌యాలు తీసుకుంటారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా మ‌న పారిశుద్ధ్య కార్మికుల వేత‌నాలు ఉన్నాయి. దేశానికే ఆద‌ర్శంగా నిలిచిన మ‌న కార్మికులు వారికున్న మంచిపేరును చెడ‌గొట్టుకోవ‌ద్ద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు.

వారు చేస్తున్న ఆందోళ‌న‌లు త‌క్ష‌ణ‌మే విర‌మించుకోవాల‌ని వారికి మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ప్రకటన వివరాలిలా ఉన్నాయి.
దేశంలో ఎక్క‌డా లేని విధంగా మ‌న తెలంగాణ రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికుల‌కు వేత‌నాలు అందుతున్నాయి. గ‌త ప్ర‌భుత్వాలలో రూ.500, వెయ్యి కూడా లేని కార్మికుల‌కు, తెలంగాణ వ‌చ్చాక కెసిఆర్ 8,500ల‌కు పెంచారు.

ఈ మ‌ధ్యే ద‌శాబ్ది ఉత్స‌వాల సంద‌ర్భంగా మ‌రో వెయ్యి రూపాయ‌లు పెంచిన ఘ‌న‌త సీఎందే అని అన్నారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పారిశుద్ధ్య కార్మికుల‌ను అవ‌మాన‌క‌రంగా చూస్తున్నారు. రాష్ట్రాన్ని దేశానికి ఆద‌ర్శంగా నిలిపారు. ఈ విజ‌యంలో గ్రామ పంచాయ‌తీల కార్య‌ద‌ర్శులు, మ‌ల్టీ ప‌ర్ప‌స్ వ‌ర్క‌ర్ల పాత్ర అమోఘం అని అభినందించారు.

ప‌నికి మాలిన కొన్ని రాజ‌కీయ పార్టీలు చేసే క్షుద్ర, స్వార్థ రాజ‌కీయాల వ‌ల‌లో ప‌డొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను అని సూచించారు. స‌మ‌యానుకూలంగా సిఎం స్పందిస్తారు. అప్ప‌టి వ‌ర‌కు కార్మికులు ఓపిక‌గా ఉండాలి. వెంట‌నే ఆందోళ‌న‌లు విర‌మించాలని కోరారు.

Latest News