Site icon vidhaatha

Nagarjuna Sagar | MLA భగత్ మాకు వద్దు.. స్థానికుడికే టికెట్ ఇవ్వాలి! సాగర్ నియోజకవర్గ అసంతృప్తి నేతల డిమాండ్

Nagarjuna Sagar |

విధాత : నాగార్జున సాగర్ బీఆరెస్ సిటింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ టికెట్‌ను ఉపసంహరించుకుని, ఆయన స్థానంలో నియోజకవర్గ స్థానిక నేతలకే టికెట్ ఇవ్వాలని బీఆరెస్ అసంతృప్త, అసమ్మతి నేతలు తీర్మానించారు. శుక్రవారం మండలంలోని బొల్లారం గ్రామంలో సాగర్ నియోజకవర్గ అసంతృప్తి నేతల సమావేశం స్థానిక జడ్పీటీసీ భర్త, మాజీ జడ్పీటీసీ గాలి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ భేటీలో నోముల భగత్ అభ్యర్ధిత్వ రద్దు కోసం తమ పోరాటం ఉదృతం చేయాలని నిర్ణయించారు. త్వరలో ఇరవై వేల మందితో సమావేశం నిర్వహించాలని, ముందుగా అన్ని మండలల్లో అసంతృప్త ఆత్మీయ సభలు జరుపాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా గాలి రవికుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ పార్టీ క్యాడర్ ను ఏమాత్రం గౌరవించకుండా ఇబ్బందులకు గురి చేశాడన్నారు. ఎమ్మెల్యే స్థాయిలో సత్తా, సమర్ధత ఉన్న బలమైన స్థానిక నాయకులు అనేక మంది ఉన్నారని, వీరిలో ఎవరికైన స్థానికులకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరారు. సమావేశంలో మాట్లాడిన పలువురు భగత్ అభ్యర్థిత్వాన్ని మార్చకపోతే ఇండిపెండెంట్గా స్థానిక నేతలు పోటీలో ఉండాలని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో గుర్రంపోడు జడ్పీటీసీ గాలి సరితా రవికుమార్, తిరుమలగిరి ఎంపీపీ భగవాన్ నాయక్ పెద్దవూర, ఎంపీపీ అనురాధ సుందర్ రెడ్డి. హాలియా ఎంపీపీ సుమతీ పురుషోత్తం, రాష్ట్ర నాయకులు పాశం గోపాల్ రెడ్డి, జిల్లా నాయకులు కరుణాకర్‌, సింగిల్ విండో చైర్మన్ కె.వి.రామారావు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు దిలీప్ రెడ్డి, పెద్దవూర సర్పంచి నడ్డి లింగయ్య యాదవ్, భరత్ రెడ్డి, మాజీ ఎంపీపీలు అల్లి పెద్దిరాజు, అంకతి వెంకటరమణ, బుర్రి రాంరెడ్డి, జైపాల్ రెడ్డి, అనంతరెడ్డి, జానయ్య, వెంకన్న గౌడ్, తౌటి సైదులు, నాగరాజు, జి. సైదులు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.

Exit mobile version