Rasi Phalalu|
జ్యోతిషం, రాశి ఫలాలు అంటే మన తెలుగు వారికి ఏండ్ల తరబడి చెరగని నమ్మకం ఉంది. లేచినప్పటి నుంచి నిద్రించే వరకు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం.అందుకే ప్రతీ రోజూ మన రాశి ఫలాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మన పనులు నిర్వహిస్తూ ఉంటాం. దాని ప్రకారమే నడుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవగానే మొదట చాలామంది వెతికేది వారికి ఆ రోజు ఎలా ఉండబోతుందనే. అలాంటి వారందరి కోసం వారి పేర్ల మీద ఈ రోజు శివరాత్రి (బుధవారం, మార్చి 12) న మీరాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం
డబ్బు లావా దేవీలకు దూరంగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు. మిత్రులను కలుస్తారు. ఇతరులకు సలహాలు, సూచనలు ఇస్తారు. గతంలో తీసుకున్న నిర్ణయాలతో వృత్తి, వ్యాపారాల్లో సత్ఫలితాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యంగా పనులు పూర్తి చేసుకుంటారు. కొత్త వారితో ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. చేసే ప్రతి ప్రయత్నం కలిసి వస్తుంది.
వృషభం
వృత్తి, వ్యాపారాలు బిజీగా ఉంటారు.మీ ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. అనేక విధాల్లో ఆదాయ వృద్ధి. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. ఉద్యోగంలో స్థిరత్వం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తుల సమస్యలు పరిష్కారం. కొత్త వస్తు, వస్త్ర ఆభరణాలు పొందుతారు.
ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటుతో సమస్యలు.
మిథునం
కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు. ఆకస్మిక ధననష్టం. దైవ కార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త ముఖ్యం. వ్యాపారంలో ఆర్థిక సమస్యల నుంచి విముక్తి. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోని వారికి మానసిక ఆందోళనలు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవాలి. మిత్రుల సాయంతో కీలక పనులు సానుకూలం.
కర్కాటకం
వ్యాపారాల్లో శుభ పరిణామాలు. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం. కోపం తగ్గించుకోవాలి. కుటుంబంలోని ముఖ్యమైన సమస్యలు పరిష్కారం. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులు. ఇతరులకు హాని తలపెట్టొద్దు. వృత్తి, ఉద్యోగాల్లో గుర్తింపు. బంధువుల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం. గృహ, వాహన విషయాల్లో ఆటంకాలు తొలగుతాయి.
సింహం
ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. కుటుంబ విషయాలపై అనాసక్తి. కుటుంబంతో పుణ్యక్షేత్రాలకు వెళ్లే అవకాశం. గృహంలో మార్పులు జరిగే అవకాశం. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. తలచిన కార్యాలు ఆలస్యం. కొన్ని పనులు తప్పక వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో ఇంటా బయటా ఒత్తిడి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు. ఉద్యోగంలో ఆశించిన మార్పులు. గృహ ప్రయత్నాలు సానుకూలం.
కన్య
ఆనందంగా కుటుంబ జీవితం. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం, ఆరోగ్యానికి లోటుండదు. ఆకస్మిక ధనలాభం. తలపెట్టిన పనులు ఆలస్యం. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు. ఆస్తి సమస్య పరిష్కారం. విందు, వినోదాల్లో పాల్గొంటారు. మనోధైర్యంతో ఉంటారు. మిత్రులతో అపార్థాలు. శుభవార్తలు వింటారు. మార్పులతో వృత్తి, వ్యాపారాల్లో ప్రయోజనాలు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం.
తుల
వ్యక్తి గత సమస్యలు, వివాదాలు పరిష్కారం. మానసిక ఆందోళన తొలగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. బంధుమిత్రులకు తోచిన సాయం చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో మెరుగు. ఆకస్మిక భయం పోతుంది. ప్రోత్సాహకరంగా ఉద్యోగ వాతావరణం. ప్రయాణాల్లో మెలకువ తప్పనిసరి. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యం. అనుకున్న పనులు విజయవంతం.
వృశ్చికం
రాదనుకున్న డబ్బు చేతికి. ప్రయత్న కార్యాలు సఫలం. ఆకస్మిక ధనలాభం. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతృప్తికరంగా వ్యాపారాల లాభాలు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు పోతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి విముక్తి. ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు. ఉద్యోగపరంగా కొద్దిగా ఇబ్బందులు. పిల్లల నుంచి శుభవార్తలు.
ధనుస్సు
మంచి పరిచయాలు కలుగుతాయి. కుటుంబ కలహాలు దూరం. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు. నిరుద్యోగులు ఆశించిన సమాచారం. వృథా ప్రయాణాలతో స్వల్ఫ సమస్యలు. ఇతరుల విషయాల్లో తల దూర్చవద్దు. అందరితో స్నేహంగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు.
మకరం
నిలకడగా వ్యాపారాలు. సంపూర్ణంగా కుటుంబ సౌఖ్యం. ఆకస్మిక ధనలాభం. వృత్తి, ఉద్యోగాల రీత్యా అధిక ప్రయాణాలు. ఇతరులకు ఉపకారం. స్త్రీల వళ్ల లాభాలు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుంచి ఆఫర్లు. పేరు, ప్రతిష్ఠలు వస్తాయి. రుణబాధలు పోతాయి. వివాహ ప్రయత్నాల్లో ఆశించిన ఫలితం లభిస్తుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. పిల్లల విద్యపై దృష్టి పెడతారు.
కుంభం
రావలసిన డబ్బు చేతికి వస్తుంది. ఊహించని కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో వృద్ధి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువ. ఆత్మీయులను కలవడంతో విఫలం. నిరుద్యోగులకు విదేశాల నుంచి సమాచారం. అనవసర వ్యయప్రసాలు. మానసిక ఆందోళనలు. వృథా ప్రయాణాలు అధికం. స్త్రీల వళ్ల ధనలాభం. అవసరాలకు మించి చేతికి డబ్బు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
మీనం
వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. అధిక ప్రయాణాలు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చు. ఆపై ఆందోళన. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం. విదేశీయాన ప్రయత్నాలు సుగమం. బంధువుల నుంచి శుభవార్తలు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి. వృత్తి, వ్యాపారాల మీద శ్రద్ధ పెట్టాలి.