Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి రోజు, ప్రతి వారం తమ రాశిఫలాలకు అనుగుణంగా వ్యక్తులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంటారు. మరి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం (Aries)
మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు తొందరపాటు నిర్ణయాలతో నష్టపోయే ప్రమాదముంది. భాగస్వాముల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఉద్యోగులకు పనిప్రదేశంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. స్థానచలనం సూచన ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మొహమాటంతో ఖర్చులు పెరగవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో చిన్న చిన్న తగాదాలు పెద్దవి కాకుండా చూసుకోండి. జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులు తెలివిగా వ్యవహరిస్తే సమస్యలు, ఒత్తిడి తొలగిపోతాయి. ప్రమోషన్‌కు కూడా అవకాశం ఉంది. వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కీలక ఒప్పందాల విషయంలో జాప్యం చోటు చేసుకోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాల కారణంగా సమస్యలు ఏర్పడవచ్చు. కుటుంబంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వివాదాలు, కలహపూరిత సంభాషణలకు దూరంగా ఉంటే మంచిది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ఉద్యోగులకు పదోన్నతులకు ఖచ్చితమైన అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోరుకునేవారు పెద్ద పెద్ద అవకాశాలు అందుకుంటారు. వ్యాపారులకు పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు, సమస్యలు ఎదురవుతాయి. గ్రహసంచారం అనుకూలంగా లేదు. కాబట్టి ఇంటా బయటా అందరితో జాగ్రత్తగా నడుచుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగులు ఉన్నతాధికారులతో వినయంగా మెలగాలి. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పనిచేయాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఆర్థిక లావాదేవీల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారులు కొత్త ప్రణాళికతో, వ్యూహాలతో ముందుకెళ్తే లాభాల పంట పండుతుంది. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించుకుంటే మంచిది. పోటీపరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణభారం తగ్గుతుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. మానసిక ఒత్తిడులు తొలగుతాయి. కీలక వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగితే మంచిది. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో వివాదాలు ఉండవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.
తుల (Libra)
తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. పదోన్నతులు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం చివరిలో దూర ప్రయాణాలు ఉండవచ్చు. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. కోపంను అదుపులో ఉంచుకోండి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు పదోన్నతులు, జీతం పెరుగుదల వంటి శుభ ఫలితాలు అందుకుంటారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి. రుణభారం తగ్గుతుంది. పాత బకాయిలు వసూలవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. కుటుంబంలో కలహాలు రాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. ఖర్చులు పెరిగే సూచన ఉంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు కెరీర్ పరంగా మంచి అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది. పట్టుదలతో వ్యవహరిస్తే ఆటంకాలను అధిగమించవచ్చు. వ్యాపారులు వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు. ఆర్థిక నిర్వహణ విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులు అడ్డంకులను అధిగమించి విజయానికి చేరువవుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు చేటు చేస్తాయి. వ్యాపారంలో, అతి విశ్వాసం ఇబ్బందులకు దారితీయవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. సొంత నిర్ణయాల కంటే సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించే వారు నూతన అవకాశాలు అందుకుంటారు. అధిక ఖర్చులు ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. మనోబలంతో ప్రారంభించిన పనుల్లో విజయాలు సాధిస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారులు వ్యాపార విస్తరణ నిమిత్తం చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికంగా, ఆదాయం పెరుగుతుంది. పలు మార్గాల ద్వారా ధనలాభాలు ఉంటాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటంబంలో శుభకార్యాలు జరుగుతాయి. నిరుద్యోగులకు మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగులు పని ప్రదేశంలో సహనంతో ఉండడం అవసరం. నిజాయితీగా పనిచేయడం ద్వారా గుర్తింపు పొందుతారు. వ్యాపారంలో నష్టాలు రాకుండా ముందుచూపుతో నడుచుకోవాలి. ప్రేమ వ్యవహారాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు. కుటుంబంలో చిన్న చిన్న గొడవలున్నా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే సర్దుకుంటాయి.