WhatsApp | వాట్సాప్‌ యూజర్లకు మరో గుడ్‌న్యూస్‌.. ఇక ‘ఛానెల్‌’లో నచ్చిన సెలబ్రెటీని ఫాలో అవ్వొచ్చు..!

WhatsApp | ఇన్‌స్టెంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ యూజర్లకు మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇప్పటి ఎన్నో కొత్త కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేసిన మెటా యాజమాన్యంలో కంపెని కొత్తగా ఫీచర్‌ను పరిచయం చేసింది. బ్రాడ్‌కాస్ట్‌ తరహాలో వాట్సాప్‌ ఛానెల్స్‌ తీసుకువచ్చింది. ఇది వన్‌వే ఛానెల్‌ లాంటిదని, ఈ ఫీచర్‌ సహాయంతో బల్క్‌గా పెద్ద సంఖ్యలో సందేశాలను పంపుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లందరికీ ఈ ఫీచర్‌ను అందబాటులోకి తీసుకువస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. కోరుకున్న వ్యక్తులు, సంస్థల నుంచి […]

  • Publish Date - September 14, 2023 / 02:19 AM IST

WhatsApp |

ఇన్‌స్టెంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ యూజర్లకు మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇప్పటి ఎన్నో కొత్త కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేసిన మెటా యాజమాన్యంలో కంపెని కొత్తగా ఫీచర్‌ను పరిచయం చేసింది. బ్రాడ్‌కాస్ట్‌ తరహాలో వాట్సాప్‌ ఛానెల్స్‌ తీసుకువచ్చింది.

ఇది వన్‌వే ఛానెల్‌ లాంటిదని, ఈ ఫీచర్‌ సహాయంతో బల్క్‌గా పెద్ద సంఖ్యలో సందేశాలను పంపుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లందరికీ ఈ ఫీచర్‌ను అందబాటులోకి తీసుకువస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. కోరుకున్న వ్యక్తులు, సంస్థల నుంచి కావాల్సిన అప్‌డేట్స్‌ను ఈ ఛానెల్స్‌ ద్వారా పొందవచ్చని కంపెనీ వెల్లడించింది.

ఈ ఫీచర్‌ సాధారణ చాట్‌లతో పోలీస్తే కాస్త మెరుగ్గా ఉండనున్నది. వ్యక్తులు, సంస్థలను ఫాలో అయ్యే వారి వివరాలు ఇతర ఫాలోవర్స్‌కు తెలియవు. బ్రాకాస్ట్‌ టూల్‌లా పని చేస్తుంది. ఛానెల్‌ అడ్మినిస్ట్రేటర్‌ తమ ఫాలోవర్లకు టెక్ట్స్‌, ఫొటోలు, వీడియోలు, స్టిక్కర్స్‌, పోల్స్‌ను పంపేందుకు వీలుంటుంది. ఇందుకు అప్‌డేట్స్‌ అనే ట్యాబ్‌ను వాట్సాప్‌ తీసుకువస్తున్నది.

ఇందులో స్టేటస్‌లతో పాటు, ఛానెళ్లకు సంబంధించిన సమాచారం ఉంటుంది. కంపెనీ వ్యాప్తంగా ఫీచర్‌ను రోలవుట్‌ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ఇప్పటికీ ఈ ఫీచర్‌ చిలీ, కొలంబియా, ఈజిప్ట్, కెన్యా, మలేషియా, మొరాకో, పెరూ, సింగపూర్ , ఉక్రెయిన్‌లలో ఈ ఛానెల్‌ అందుబాటులో ఉంది. సొంత వాట్సాప్‌ ఛానల్‌ ప్రారంభమైన తర్వాత సినిమా స్టార్‌, స్పోర్ట్స్‌ స్టార్స్‌, సంస్థలు మీకు వచ్చిన వారిని ఫాలో అయ్యేందుకు అవకాశం ఉంది.

ఎలా ఉపయోగించాలంటే..

ఈ ఫీచర్‌ను ఉపయోగించుకునే ముందుగా వాట్సాప్‌ను ప్లేస్టోర్‌ లేదంటే యాప్‌ స్టోర్‌లో ఉన్న తాజా వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత వాట్సాప్‌ ఓపెన్‌ చేసి స్క్రీన్‌ దిగువన ఉన్న అప్‌డేట్‌ ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి. అప్పుడు ఛాలెన్స్‌ లిస్ట్‌ కనిపిస్తుంది.

మీరు ఫాలో అవ్వాలనుకున్న సంబంధిత ఛానెల్‌ పక్కన ‘ప్లస్‌’ బటన్‌ ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేయాలి. ఇక్కడ డిస్క్రిప్షన్‌, ప్రొఫైల్‌, ఛానెల్‌ పేరు సైతం చూసే వీలుంటుంది. ఛాలెన్‌ అప్‌డేట్‌ రియాక్షన్‌ కోసం మెసేజ్‌పై లాంగ్‌ ప్రెస్‌ చెస్తే సరిపోతుంది.

Latest News