విధాత: పశ్చిమబెంగాల్ రాష్టం హౌరా జిల్లా సంక్రైల్ ప్రాంతంలో ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తన కూతురు చదువు కోసం భర్త కిడ్నీని రూ.10 లక్షలకు విక్రయించింది. అపై రూ.10 లక్షలు ఇంటికి తెచ్చి బ్యాంకులో డిపాజిట్ చేస్తానని భర్తను నమ్మించి రాత్రికి రాత్రే అదృశ్యం అయింది.
దీంతో భర్త కిన్నుడై భార్య ఆచూకీ కోసం భర్త విచారించగా.. బరాక్‌పూర్ ప్రాంతంలో ఓ పెయింటర్‌తో కలిసి సహజీవనం చేస్తున్నట్లు తేలింది. దీంతో భర్త తరుపు కుటుంబ సభ్యులను తీసుకువెళ్లి నిలదీయగా.. విడాకుల నోటీసులు పంపిస్తానని భార్య బెదిరించింది. దీంతో ఏం చేయాలో పాలుపోక సదరు భర్త మోసపోయానని గ్రహించి భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు ఈ వార్త దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.