Site icon vidhaatha

Viral Video | వృద్ధ టీచ‌ర్‌ను చిత‌క‌బాదిన మ‌హిళా కానిస్టేబుళ్లు

Viral Video | ఓ ఇద్ద‌రు మ‌హిళా కానిస్టేబుళ్లు( women cops )రెచ్చిపోయారు. ఓ వృద్ధుడిపై చెల‌రేగిపోయారు. న‌డిరోడ్డుపైనే అత‌డిపై లాఠీలు ఝులిపించి, పైశాచిక ఆనందాన్ని పొందారు. ఈ దారుణ ఘ‌ట‌న బీహార్( Bihar) కైమూర్ జిల్లాలోని ఓ ప్ర‌ధాన ర‌హ‌దారిలో వెలుగు చూసింది.

కైమూర్ జిల్లా ( Kaimuru Dist )కు చెందిన నావ‌ల్ కిశోర్ పాండే (70) స్థానికంగా ఉన్న ఓ ప్రవేటు పాఠ‌శాల‌లో ఇంగ్లీష్ టీచ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. అయితే స్కూల్ నుంచి సాయంత్రం స‌మ‌యంలో ఇంటికి తిరిగి వెళ్తుండ‌గా, త‌న సైకిల్ స్కిడ్ అయి రోడ్డుపై ప‌డిపోయాడు. వృద్ధుడు కావ‌డంతో.. సైకిల్‌ను రోడ్డుపై నుంచి తీసేందుకు కొంత స‌మ‌యం ప‌ట్టింది. దీంతో కాస్త ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది.

దీంతో అక్క‌డే విధుల్లో ఉన్న ఓ ఇద్ద‌రు మ‌హిళా కానిస్టేబుళ్లు వీరంగం సృష్టించారు. పాండేపై విచక్షణా రహితంగా లాఠీలు ఝులిపించారు. కొట్టొద్దమ్మా అంటూ ఆ వృద్ధుడు బ‌తిమాలుతున్నా ఆయన మాట‌లు వినిపించుకోకుండా చిత‌క‌బాదారు.

ఈ వీడియోలు కాస్తా సోష‌ల్ మీడియాలో వైర‌లై పోలీసు ఉన్న‌తాధికారుల‌కు చేర‌డంతో.. ఆ ఇద్ద‌రు మ‌హిళా కానిస్టేబుళ్ల‌ను మూడు నెల‌ల పాటు స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Exit mobile version