Sri Ramana | మిథునం రచయిత శ్రీరమణ కన్నుమూత

<p>Sri Ramana ప్రముఖ రచయిత, కథకుడు, పాత్రికేయులు శ్రీరమణ నిన్న రాత్రి కన్నుమూశారు. 71 సంవత్సరాల శ్రీరమణ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పేరడీ రచనలకు, వ్యంగ్య హాస్య భరితమైన కాలమిస్టుగా, కథకుడిగా అలాగే సాహిత్య, కళా రంగాల్లో శ్రీరమణ తన మార్క్ వేసుకున్నారు. తనికెళ్ల భరణి దర్శకత్వంలో వచ్చిన 'మిథునం' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమా తనికెళ్ల భరణితో […]</p>

Sri Ramana

ప్రముఖ రచయిత, కథకుడు, పాత్రికేయులు శ్రీరమణ నిన్న రాత్రి కన్నుమూశారు. 71 సంవత్సరాల శ్రీరమణ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పేరడీ రచనలకు, వ్యంగ్య హాస్య భరితమైన కాలమిస్టుగా, కథకుడిగా అలాగే సాహిత్య, కళా రంగాల్లో శ్రీరమణ తన మార్క్ వేసుకున్నారు.

తనికెళ్ల భరణి దర్శకత్వంలో వచ్చిన ‘మిథునం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమా తనికెళ్ల భరణితో పాటు శ్రీరమణకు కూడా మంచి పేరు తీసుకొచ్చింది. పత్రిక అనే మాస పత్రికకు ఆయనకు సంపాదకునిగా కూడా ఉన్నారు. శ్రీరమణ 1952, సెప్టెంబర్ 21న గుంటూరు జిల్లా వేమూరు మండలంలోని వరహాపురం అగ్రహారం అనే గ్రామంలో జన్మించారు.