Site icon vidhaatha

ఏసీబీ వలలో మాదాపూర్ ఎస్సై.. రైటర్‌

విధాత: మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై రంజిత్‌, రైటర్ విక్రమ్‌లు 30వేలు లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కారు. వారిని పట్టుకున్న ఏసీబీ బృందం స్టేషన్‌లో తనిఖీలు చేపట్టింది. మాదాపూర్‌ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది అవినీతి వ్యవహారంపై ఏసీబీ రెండు రోజులుగా నిఘాపెట్టి తన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.

ఓ కేసు విషయంలో న్యాయం కోసం వచ్చిన బాధితుడిని లంచం డిమాండ్ చేయగా అతను ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ ట్రాప్ మేరకు బాధితుడి నుంచి ఎస్‌ఐ సూచనలతో రైటర్ విక్రమ్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నామని, ఎస్సై, రైటర్‌లను అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు.

Exit mobile version