Site icon vidhaatha

Yadadri-Bhuvanagiri | దశాబ్ది ఉత్సవాల అడ్డగింత..! కాంగ్రెస్.. BRSల మధ్య రగడ!!

Yadadri-Bhuvanagiri

విధాత: యాదాద్రి-భువనగిరి జిల్లా పరిధిలో బొల్లెపల్లి రైతువేదికలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, భువనగిరి నియోజక ఇన్‌చార్జి కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధ్వర్యంలో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు మధ్య వాగ్వివాదం, బాహాబాహిగా సాగింది.

రెండు నెలలు గడుస్తున్నా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా.. సంబరాలు ఎందుకంటు అనీల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డిని నిలదీశారు.

రైతులు ఆకలితో అలమటిస్తుంటే మీరు సంబరాలు చేస్తారా అంటూ రైతు సమస్యలను ప్రస్తావిస్తూ వాగ్వివాదానికి దిగారు. రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసిత రైతులపై కేసులు పెట్టి జైలు పాలు చేసిన మీ పార్టీకి రైతు ఉత్సవాన్ని నిర్వహించే అర్హత లేదంటూ నిలదీశారు.

దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జ‌రిగి, రైతు వేదికలోని కుర్చీలను విసిరేసుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను నియంత్రించారు. సమావేశంలో జ‌రిగిన రభసతో రైతు ఉత్సవ కార్యక్రమం అర్ధాంతరంగా ఆగిపోయింది.

Exit mobile version