NBK |
విధాత: ఏది ఏమైనా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయడం, ఎవరికీ తలవంచని తత్వం నందమూరి నటసింహం బాలయ్య సొంతం. వయసు పెరుగుతున్నా, రెట్టించిన ఉత్సాహంతో యంగ్ హీరోలకు ధీటుగా సాగిపోతున్న స్టార్ హీరో బాలకృష్ట.. ప్రస్తుతం ‘భగవంత్ కేసరి’ సినిమాతో బిజీగా ఉన్నారు.
ఇక బాలయ్య సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసిన అన్‌స్టాపబుల్ సీజన్ 3 త్వరలోనే మొదలు కాబోతుంది. సీజన్ 1, 2 లకు మించి ఇది ఉండబోతుందని.. దీనికి చిరంజీవి, నాగార్జున, చరణ్, తారక్ వచ్చే అవకాశం ఉందనేలా వార్తలు కూడా అప్పుడే వైరల్ అవుతున్నాయి. ఇక విషయంలోకి వస్తే..
తాజాగా జగపతిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రుద్రంగి’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో సుమతో బాలయ్య వేసిన పంచులు వైరల్ అవుతూ.. ట్రోలింగ్‌కి కారణమవుతున్నాయి. ఈ వేడుక జరిగి రెండు మూడు రోజులు అవుతున్నా.. ఇంకా బాలయ్యపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంది.
‘రుద్రంగి’ సినిమాకు తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రొడ్యూసర్ కాగా, పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో మొత్తం తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దీనికి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈవెంట్‌లోనే బాలయ్య అభిమానులు ‘కోకోకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ’ అని చేసిన కామెంట్స్‌కి నన్ను సెక్సీ అంటే సుమ, మమతామోహన్ దాస్ వంటి వారు ఫీలవుతారని అంటూ సుమని దగ్గరకి పిలిచి మరీ నువ్వు ఫీలవుతావు కదా.. అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ అభిమానుల్లో హుషారు నింపినా.. నెటిజన్లలో మాత్రం ట్రోల్ చేయిస్తున్నాయి. అలాగే సుమని నీ వాగుడు ఇక కట్టిపెట్టు అంటూ బాలయ్య సీరియస్‌గా అన్న మాటలు కూడా.. ఓ వర్గానికి ఆయన చేతినిండా పని దొరికేలా చేశాయి.
Suma ki chempa dhebbalu appudappudu avasaram
– Ballayya
Ivem maatalu raaa ayyaa