Site icon vidhaatha

Rasi Phalalu: మార్చి6, గురువారం.. మీ రాశి ఫలాలు! వారికి.. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలను మించి రాబడి

Rasi Phalalu| Horoscope

జ్యోతిషం, రాశి ఫ‌లాలు అంటే మ‌న తెలుగు వారికి ఏండ్ల త‌ర‌బ‌డి నమ్మకం ఉంది. లేచిన ద‌గ్గ‌రి నుంచి నిద్రించే వ‌ర‌కు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే ప్ర‌తీ రోజూ మ‌న రాశి ఫ‌లాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ మ‌న ప‌నులు నిర్వ‌హిస్తూ ఉంటాం. రాశి ఫ‌లాల ప్ర‌కార‌మే న‌డుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవ‌గానే మొద‌ట చాలామంది వెతికేది ఆ రోజు ఎలా ఉండ‌బోతుంద‌నే. అలాంటి వారంద‌రి కోసం వారి పేర్ల మీద ఈ రోజు సోమ‌వారం, మార్చి3 న‌ మీరాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం

వ్యక్తిగత సమస్యల నుంచి ఉప‌శ‌మ‌నం. శ్రమ‌కు త‌గ్గ‌ ఫ‌లితం. సమయానికి ముఖ్యమైన ప‌నులు పూర్తి. ధనచింత ఉండదు. సుల‌భంగా శుభకార్య ప్రయ‌త్నాలు. ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు. ప్రయాణాల వ‌ల్ల లాభం. స‌మాజంలో గౌర‌వ‌మ‌ర్యాదలు. లాభసాటిగా వ్యాపారాలు.

వృషభం

తలపెట్టిన పనులు పూర్తి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరం.. ఆశాజనకంగా ఆర్థిక విషయాలు. కొన్ని వ్య‌వ‌హారాల్లో ఓపికతో వ్య‌వ‌హ‌రించాలి. వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలు, బాధ్యతల‌లో మార్పులు. బంధు, మిత్రులతో విరోధ అవ‌కాశం. ఆస్తి విష‌యంలో సోదరులతో ఇబ్బందులు. అనవసర ధనవ్యయం. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం. అధిక‌ రుణ ప్రయత్నాలు. అనారోగ్య బాధలు. ఆరోగ్యంపై శ్రద్ధ వ‌హించాలి. నిలకడగా వ్యాపారాలు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ఆదాయంలో వృద్ధి. ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి.

మిథునం

రావలసిన డబ్బులు చేతికి వ‌స్తాయి. ఆర్థిక పరిస్థితిలో తేడా ఉండదు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలను మించి రాబడి. ముఖ్యమైన పనులు వాయిదా. ఉద్యోగంలో జీతభత్యాలు, ప్రమోషన్ల విష‌యంలో శుభ వార్తలు.మానసిక చంచలంలో ఇబ్బంది. సోమరితనం ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు. బంధువుల విష‌యంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లల విష‌యంలో జాగ్రత్తగా ఉండాలి. మంచి అవకాశాలు మిస్ అవుతాయి. ఆర్థిక పరమైన ఒత్తిళ్ల నుంచి ఉప‌శ‌మ‌నం. ముఖ్య వ్యవహారాలు సవ్యంగా పూర్తి.

కర్కాటకం

నిరుద్యోగులకు ఆశించిన అవ‌కాశాలు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపార లాభాల్లో నిలకడ. స్థిరాస్తుల సమస్యలు పరిష్కారం. నూతన గృహకార్యాలపై శ్రద్ధ. ఆస్తి విష‌యంలో సోదరులతో రాజీకి య‌త్నిస్తారు. బంధు, మిత్రులతో విందులు, వినోదాలు. ఇంటా బయటా పని ఒత్తిడి. దైవదర్శనం చేసుకుంటారు. స్వల్ప అనారోగ్యం. భక్తిశ్రద్ధలు అధికం. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం. ఉద్యోగాల్లో సానుకూల మార్పులు, చేర్పులు.

సింహం

వ్యక్తి గత సమస్యల నుంచి విముక్తి. కొత్త‌ వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. పలుకు బడి ఉన్న‌ వ్యక్తులతో పరిచయాలు. ప్రయత్న కార్యాల్లో ఆటంకాలు. దైవదర్శనాలు. రుణప్రయత్నాలు ఆలస్యం. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు. సోదర వైరం అవకాశం. వ్యాపారాలు సానుకూలం. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం. ఆస్తి వివాదం నుంచి ఉప‌శ‌మ‌నం.ఇంటా బయటా ప‌ని ఒత్తిడి.

కన్య

సానుకూలంగా వృత్తి, ఉద్యోగాలు. మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం అవ‌కాశం. అదనపు ఆదాయ ప్రయత్నాలు స‌ఫలం. స్వ‌ల్ఫ‌ అనారోగ్య స‌మ‌స్య‌లు. కుటుంబసమేతంగా దైవ దర్శనాలు. వ్యయ ప్రయాసలతో ముఖ్య వ్యవహారాలు పూర్తి. ఆకస్మిక కలహాలకు అవకాశం. చెడు సహవాసానికి దూరంగా ఉండాలి. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు. సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టం. వ్యాపారాల్లో లాభాలు అంతంత మాత్రం.

తుల

బంధు మిత్రులకు అవసరమైన సహాయ సహకారాలు. నూతనకార్యాలకు శ్రీకారం. ఉద్యోగ, పెళ్లి ప్రయ త్నాలు సఫలం. బంధు, మిత్రుల సహకారం ఆలస్యం. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం. అధిక వృథా ప్రయాణాలు. బిజీగా వృత్తి జీవితం. వ్యాపార రంగంలో లాభాలు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు. రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాల్లో కొత్త మార్పులు. తలపెట్టిన కార్యంలో విజయం.

వృశ్చికం

కుటుంబ సభ్యులతో దైవ కార్యాలు. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలం. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం. అధిక ప్రయాణాలు. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం. వృత్తి, గృహాల్లో స్థానచలనం. రుణ లాభం. వ్యాపారాల్లో పోటీదారుల‌పై పైచేయి. ప్రయత్నకార్యాల్లో ఆటంకాలు. అధికారుల నమ్మకం చూరగొంటారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. ఇంటా బయటా బాధ్యతల్లో పెరుగుద‌ల‌.

ధనుస్సు

వృత్తి, వ్యాపారాల్లో పురోగతి. కుటుంబ కలహాలు దూరం. అవసరానికి మిత్రుల నుంచి సాయం. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. ప్రయత్నకార్యాల్లో ఆటంకాలు. పలుకుబడి ఉన్న‌ వ్యక్తులతో పరిచయాలు. వృథా ప్రయాణాలు అధికం. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు. అందరితో స్నేహానికి ప్రయత్నించాలి. నిలకడగా ఆరోగ్యం. స్వల్పంగా ఆర్థిక ఇబ్బందులు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం.

మకరం

ఆర్థిక సమస్యలు తగ్గుముఖం. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం. పెళ్లి ప్రయత్నాల విషయంలో శుభవార్తలు. తలచిన కార్యాల్లో విజ‌యం. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం. బంధు, మిత్రుల మర్యాదలు పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. తల పెట్టిన పనులు ఆల‌స్యం. ప్రణాళికాబద్ధంగా ఆలోచనలు. సానుకూలంగా ఉద్యోగ జీవితం, ఆర్థిక వ్యవహారాలు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి.

కుంభం

వృత్తి, ఉద్యోగాలరీత్యా ప్రయాణాలు. ఉద్యోగంలో సానుకూల మార్పులు. నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయత్నకార్యాల్లో విజయం. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్. తలపెట్టిన ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలు. కుటుంబ సమేతంగా ఆలయాల సందర్శణ‌. సజావుగా ఆర్థిక వ్యవహారాలు. స్థిరాస్తుల సమస్యలు పరిష్కారం. కళల్లో ఆసక్తి. నిలకడగా ఆర్థిక పరిస్థితి. నిరుద్యోగులకు ఆవ‌కాశాలు.

మీనం

ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు. సంతృప్తిక‌రంగా కుటుంబ ప‌రిస్థితులు. బంధుమిత్రుల నుంచి రావలసిన సొమ్ము చేతికి. ఆరోగ్యంపై శ్రద్ధ వ‌హించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతం. కొత్త‌ కార్యాలు ప్రారంభించ‌కుండా ఉంటే మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాలకోసం సమయం వృథా. పెళ్లి ప్రయత్నాలకు స్పందన. అధికారులతో అనుకూలతలు. వృత్తి, వ్యాపారాల్లో వృద్ధి. ఉద్యోగంలో పని భారం

Exit mobile version