Healthy Life | పండంటి ఆరోగ్యానికి ప‌న్నెండు సూత్రాలు

ఈ కాలంలో ఏ ఆసుప‌త్రి చూసినా, జ‌నం కిట‌కిట‌లాడిపోతున్నారు. అది ప్రైవేట‌యినా, ప్ర‌భుత్వాసుప‌త్రయినా, కార్పొరేట్ అయినా.. జ‌నాలు చేప‌ల‌మార్కెట్‌లో ఉన్న‌ట్లు ఉంటున్నారు

  • Publish Date - March 5, 2024 / 08:43 AM IST

ఈ కాలంలో ఏ ఆసుప‌త్రి చూసినా, జ‌నం కిట‌కిట‌లాడిపోతున్నారు. అది ప్రైవేట‌యినా, ప్ర‌భుత్వాసుప‌త్రయినా, కార్పొరేట్ అయినా.. జ‌నాలు చేప‌ల‌మార్కెట్‌లో ఉన్న‌ట్లు ఉంటున్నారు. రోడ్ల మీద‌కంటే ఆసుప‌త్రుల్లోనే ఎక్కువమంది క‌న‌బ‌డుతున్నారు. ఆసుప‌త్రిలో ఎంత ఖ‌ర్చ‌యినా వెనుకాడ‌ట్లేదు. కార‌ణం, ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు క‌నుక‌. ఎందుకు? ఈ ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింది.? బాల్యంలోనే గుండెపోట్లు, 40 దాట‌క‌ముందే మోకాళ్ల‌నొప్పులు, వెన్నునొప్పులు. ఇక‌ షుగ‌ర్లు, బీపీలయితే కంప‌ల్స‌రీ.


కార‌ణం…. జీవ‌న‌శైలిలో మార్పులు. అన్నీ మారిపోయాయి. తిండి, నిద్ర, ఆరోగ్యం మీద శ్ర‌ద్ధ‌, వ్యాయామం, మాన‌సిక ప్ర‌శాంత‌త‌..ఇలా అన్నీ అన్నీ డిస్ట‌ర్బ్ అయిపోయాయి. ఎంత‌సేపూ డ‌బ్బు.. డ‌బ్బు… డ‌బ్బు..అంతే. తీరా ఆ డబ్బంతా సంపాదించాక అనుభ‌వించానికి శ‌రీరం స‌హ‌క‌రించ‌దు. స‌క‌ల‌రోగాల పుట్ట‌గా మారిపోయిఉంటుంది. ఇక ఎందుకీ జీవితం.?


జీవ‌న‌శైలిలో చిన్న‌చిన్న మార్పులతో, ఆరోగ్యాన్ని ప‌దిలంగా ఉంచుకోవ‌చ్చు. విదేశాల‌లో ఆరోగ్యానికి చాలా ప్రాధాన్య‌త‌నిస్తారు. అటు ప్ర‌భుత్వంగానీ, ఇటు ప్ర‌జ‌లు గానీ, ఆరోగ్యం విష‌యంలో అస్స‌లు రాజీప‌డ‌రు. అదే వారిని ఆనందంగా, ఆరోగ్యంగా ఉంచుతోంది.


ఈ కింది చిట్కాలు చిన్న‌వే అయినా, ప్రాక్టిక‌ల్‌గా నిరూపించ‌బ‌డిన‌వి. విచిత్రంగా ఉన్నా అవి నిజ‌మేన‌ని అనుభ‌వ‌జ్ఞులు చెబుతున్నారు. పాటిస్తే హాని ఎలాగూ లేదు. కానీ, మంచి జ‌రిగే అవ‌కాశం మాత్రం త‌ప్ప‌కుండా ఉంది. ట్రై చేయండి.


1. నిలబడి నీళ్లు తాగే వారికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. వారి మోకాలు నొప్పిని ప్రపంచంలో ఏ వైద్యుడు బాగు చేయలేడు. కాబట్టి కూర్చొని నీళ్లు తాగండి.

2. వేగంగా తిరిగే ఫ్యాను గాలి కింద లేదా ఏసీలో పడుకుంటే శరీరం పెరిగి లావైపోతారు. అధిక బరువు వలన రక్తపోటు, చక్కెర వ్యాధి వస్తాయి.

3. 70 శాతం నొప్పులకు ఒక గ్లాసు వేడి నీళ్లు చేసే మేలు, నొప్పి తగ్గించే మాత్రలు ఏవి కూడా చేయవు. ఒక గ్లాసు నులివెచ్చని నీళ్లు తాగి చూడండి.

4. కుక్కర్లో పప్పు మెదుగుతుంది కానీ ఉడకదు. అందుకే గ్యాస్ మరియు ఎసిడిటీ వస్తుంది. మెత్త‌న‌వ‌డం, ఉడ‌క‌డం.. రెండూ వేర్వేర‌ని గుర్తించండి.

5. అల్యూమినియం పాత్రలలో వంట చేయడం బ్రిటిష్ వాళ్ళు భారతీయ దేశభక్తులైన ఖైదీలను అనారోగ్యం పాలు చేయడానికి వాడేవారు. వంట‌కి అల్యూమినియం వాడ‌కండి.

6. కొబ్బరినీళ్లు ఉదయం 11:00 గం లోపు తాగితే అమృతంలా పనిచేస్తాయి.

7. పక్షవాతం వచ్చిన వెంటనే రోగి ముక్కు లో ఆవు నెయ్యి వేస్తే కొంత ఉపశమనం కలుగుతుంది.

8. వారానికి కనీసం నాలుగు సార్లు ఒక అరగంట చొప్పున నడక అలవాటు చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం.

9. ప్రతిరోజు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగాలి.

10. రోజుకి కనీసం ఆరు గంటలు తగ్గకుండా నిద్రపోవాలి.

11. ఆహారంలో పంచ‌దార‌, ఉప్పు, కారం తగ్గించాలి.

12. త‌గినంత ఆహారం తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. డైటింగ్ పేరుతో క‌డుపు మాడ్చుకుంటే మొద‌టికే మోసం వ‌స్తుంది. బరువు పెరుగుతుందని ఆహారాన్ని మందుల వలె తింటే భవిష్యత్తులో మందుల్ని ఆహారంగా తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా యువ‌తీయువకులు గమనించాల్సిన విష‌య‌మిది.



వీటిలో కొన్నింటికి శాస్త్రీయ ఆధారాలు లేక‌పోయినా, కొన్ని ద‌శాబ్దాలుగా వాడుక‌లో ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కి, వేడినీళ్ల‌లో ఎప్సం సాల్ట్ వేసుకుని స్నానం చేస్తే నొప్పుల‌న్నీ ఒంటినొప్పుల‌న్నీ మాయ‌మ‌వుతాయి. ఇది నిజంగానే నిజం. కానీ, శాస్త్రీయంగా ఆధారాలు చూప‌లేక‌పోయారు.నిజానికి ఇవ‌న్నీ కొత్త‌వేం కాదు. మ‌న‌వాళ్లు వాడివాడీ పండిపోయారు.పైవ‌న్నీ పాత త‌రాలు త‌మ జీవ‌న‌విధానంలో భాగంగా చేసేవారు. వారికి వేరే ఆప్ష‌న్లు కూడా లేవు. మైళ్ల కొద్దీ న‌డ‌వ‌డం, ప‌ళ్లెం నిండా తిన‌డం, తెల్ల‌వారుఝూమునుంచే ప‌నిచేయ‌డం, సూర్య‌కాంతి త‌గినంత‌గా గ్ర‌హించ‌డం, శారీర‌క శ్ర‌మ అధికంగా ప‌డ‌టం, మిల్లెట్లే తిన‌డం.. ఇలా ఇవ‌న్నీ వారి జీవితంలో త‌ప్ప‌నిస‌రి భాగ‌మ‌య్యాయి.


అందుకే వారు తొంభ‌యేళ్ల‌కు పైగా ఆరోగ్యంగా ఉండేవారు. ఆడ‌వాళ్లు ప‌న్నెండు మందిని క‌న్నా, దిట్టంగా ఉండేవారు. అన్నింటికంటే ముఖ్యంగా వారు ఉన్న‌దాంతో తృప్తి ప‌డేవారు. మాన‌సికంగా ఎంతో ప్ర‌శాంతంగా, ఊరంద‌రితో క‌లిసిమెలిసి బ‌తికేవారు. అంతే.. అదే వారి హెల్త్ సీక్రెట్‌. మ‌నం.., పైన వాళ్లు పాటించిన‌వ‌న్నీ ఇప్పుడు కొనుక్కుని పాటించాలి. వేల‌కువేలు ఖ‌ర్చుపెట్టి పాడుచేసుకోవ‌డం ఎందుకు? ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు ఖ‌ర్చుపెట్టి బాగుచేసుకోవ‌డం ఎందుకు? కొంత ఆలోచించి, ఆరోగ్యం జీవితానికి ఎంత అవ‌స‌ర‌మో తెలుసుకుంటే, కొన్ని భ్ర‌మ‌లు వీడితే మంచి ఆరోగ్యం మీ సొంతం.

Latest News