Food Items in Refrigerator | ప్రతి ఇక్కరి ఇంట్లో ఉన్న ఫ్రిజ్( Refrigerator )లో ఆకుకూరలు, కూరగాయలు( Vegetables ) మాత్రమే పెట్టరు. అందులో దోస పిండి, ఇడ్లీ పిండి, మిగిలిపోయిన కూరలు.. ఇలా ఒక్కటేమిటి..? అనేక ఆహార పదార్థాలతో( Food Items ) ఫ్రిజ్ నిండిపోయి ఉంటుంది. ఫ్రిజ్‌లో ఏది పడితే అది పెట్టడం మంచిది కాదనే విషయం చాలా మందికి తెలియదు. కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టకుండా గది ఉష్ణోగ్రతలో బయట ఉంచితేనే ఆరోగ్యానికి శ్రేయస్కరం అని ఆరోగ్య నిపుణులు( health Experts ) సూచిస్తున్నారు. మరి ఫ్రిజ్‌లో పెట్టకూడని ఆహార పదార్థాలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఫ్రిజ్‌లో పెట్టకూడని ఆహార పదార్థాలు ఇవే..
- వంట నూనెల్ని కొందరు ఫ్రిజ్‌లో ఉంచుతుంటారు. శాచురేటెడ్ కొవ్వులున్న నూనెలను అత్యంత చల్లటి ప్రదేశంలో ఉంచాల్సిన అవసరం లేదు.
- కెచప్‌లు, సాస్‌లలో కూడా ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారు కాబట్టి వీటిని ఫ్రిజ్‌లో ఉంచాల్సిన అవసరం లేదు.
- ఆరెంజ్‌తో పాటు నిమ్మకాయలను కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదు.
- సపోటా, జామ, ఆపిల్స్, అరటి పండ్లు, కర్జూరం, పులుపు పండ్లు.. వీటిలో టెక్చర్ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఫ్రిజ్‌లో ఉంచడం కారణంగా టెక్చర్ దెబ్బతింటుంది. ఫ్లేవర్ కూడా పోతుంది.
- పిల్లలు ఎక్కువగా తినే బ్రెడ్, జామ్‌లు సైతం ఫ్రిజ్‌లో ఉంచుతుంటారు. ఇలా చేయడం మూలంగా బ్రెడ్లోని జిగురు, తేమ పోతాయి. స్లయిసెస్ పిండి పిండిగా మారుతాయి. బ్రెడ్లోని జిగురు పోతే తినడానికి సులువుగా ఉండదు.
- తేనేను ఫ్రిజ్‌లో ఉంచితే గట్టిపడే అవకాశం ఉంది. ఇందులోని షుగర్ కంటెంట్ స్పటికాలుగా కూడా మారుతుంది. కాబట్టి బయట ఉంచితేనే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
