Site icon vidhaatha

Couples Life | భార్య‌లో ఈ నాలుగు ల‌క్ష‌ణాలు ఉంటే.. ప్ర‌తి భ‌ర్త జీవితం ఆనంద‌దాయ‌క‌మే..!

Couples Life | భార్యాభ‌ర్త‌ల సంసార జీవితం( Couples Life ) సాఫీగా సాగాలంటే.. దంపతుల మ‌ధ్య ప్రేమ‌నురాగాలు( Love ) త‌ప్ప‌నిస‌రి. ఊరికే చికాకు, అస‌హ‌నం, కోపం తెచ్చుకోవ‌ద్దు. ఒక‌రు కోపంగా ఉంటే మ‌రొక‌రు ప్రేమ‌గా ఉండాలి. అంతేకాకుండా ఇద్ద‌రు దంప‌తుల( Couples ) మ‌ధ్య అన్యోన్య‌త‌, ఆత్మీయ‌త‌, చిలిపి గొడ‌వ‌లు, బాధ్య‌త‌లు ఉండాలి. ఇవ‌న్నీ ఉంటే ఆ భార్యాభ‌ర్త‌ల సంసార జీవితం( Married Life ) సాఫీగా సాగిపోతూ.. ప‌దికాలాల పాటు ప‌దిలంగా ఉంటుంది. ముఖ్యంగా భార్య‌లు( Wife ) ఈ నాలుగు ల‌క్ష‌ణాలు క‌లిగి ఉంటే.. భర్త‌లు కూడా హ్యాపీగా, ఎనర్జ‌టిక్‌గా ఉంటార‌ని మాన‌సిక నిపుణులు చెబుతున్న మాట‌.

భ‌ర్త‌తో నిజాయితీగా ఉండాలి..

ప్ర‌తి భార్య త‌న భ‌ర్త‌తో నిజాయితీగా ఉండ‌డం నేర్చుకోవాలి. అబ‌ద్దాలు సంసారాన్ని కూల్చ‌స్తాయి కాబ‌ట్టి. అందుకే భ‌ర్త‌తో నిజాయితీగా ఉంటే.. ఆ ఆనందం, జీవితం వేరేలా ఉంటుంది.

త‌ప్పును అంగీక‌రించాలి..

ఇక రెండోది త‌ప్పును అంగీక‌రించ‌డం. చాలా మంది మ‌హిళ‌లు త‌మ త‌ప్పును అంగీక‌రించ‌రు. పైగా ఆ నింద‌ను భ‌ర్త మీద తోసేస్తుంటారు. ఇలా చేయడం వల్ల దంప‌తుల మ‌ధ్య సంబంధం బలహీన పడుతుంది. అందుకే మీ తప్పును కచ్చితంగా అంగీకరించండి.

వినే అల‌వాటు ఉండాలి..

కుటుంబ స‌మ‌స్య గానీ, బ‌య‌టి స‌మ‌స్య గానీ.. ఓపిక‌గా వినే అల‌వాటు భార్య‌ల‌కు ఉండాలి. విన‌కుండా, అర్థం చేసుకోకుండా అడ్డంగా మాట్లాడ‌కూడ‌దు. వినే అల‌వాటు ఉంటే భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు రానే రావు. భర్త మంచి మాట చెబితే దాన్ని త‌ప్ప‌కుండా గౌర‌వించాలి. ఒక వేళ చెడు మాట చెబితే త‌ప్ప‌కుండా ఖండించండి. ఏ సంబంధం లోనైనా వినడం చాలా ముఖ్యం కాబట్టి ఒకరి మాట ఒకరు వింటే ఎప్పుడు గొడవలు రావు.

దంప‌తులు గౌర‌వించుకోవాలి..

గౌర‌వించుకోవ‌డం అనేది భార్యాభ‌ర్త‌ల‌కు చాలా ముఖ్యం. బూతులు మాట్లాడుకోకుండా.. ప్రేమ‌గా పిలుచుకోవాలి. ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డేలా, ఆక‌ర్షించుకునేలా మాట్లాడుకోవాలి. ఇలా ఒకరికొకరు గౌరవించుకుంటే ఆ బంధం పదికాలాలపాటు పదిలంగా ఉంటుంది. భ‌ర్త‌తోనే కాదు కుటుంబ స‌భ్యుల‌కు కూడా గౌరవం ఇస్తూ, వినయంగా మాట్లాడే భార్య ఉంటే అదృష్టం కలిసి వస్తుంది. ప్రశాంతత కూడా లభిస్తుంది. మీ వివాహ బంధం ప‌ది కాలాల ప‌దిలంగా ఉండాలంటే.. ఈ నాలుగు ల‌క్ష‌ణాలు త‌ప్ప‌నిస‌రి చేసుకోండి.

ఇవి కూడా చ‌ద‌వండి..

న‌ల్ల కోళ్ల వ్యాపారం.. ఏడాదికి రూ. 25 ల‌క్ష‌లు సంపాదిస్తున్న ఐటీ ఇంజినీర్

రామ్​చరణ్​ సరికొత్త అవతారం? 23 ఏళ్ల తర్వాత తెలుగుతెరపై తిరిగి ఆ జానర్​​​

బంగాళదుంప తల్లిదండ్రులెవరో తెలుసా?

ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఇల్లు, భూమి కొనేందుకు అనుకూల స‌మ‌యం..!

Exit mobile version