పాక్ సరిహ‌ద్దులో డ్ర‌గ్స్‌, తుటాలు సీజ్‌

  • Publish Date - October 30, 2023 / 08:15 AM IST
  • 3 కిలోల హెరాయిన్, 30 ఎంఎం 4 కాట్రిడ్జ్‌లు స్వాధీనం


విధాత‌: పంజాబ్‌లోని పాక్ స‌రిహ‌ద్దులో భ‌ద్ర‌తా ద‌ళాలు భారీగా డ్ర‌గ్స్‌, తుటాలు స్వాధీనం చేసుకున్నాయి. తార్న్ తరన్ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని పొలంలో దాదాపు మూడు కిలోల హెరాయిన్‌తోపాటు నాలుగు కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్టు సరిహద్దు భద్రతా దళ అధికారి సోమవారం వెల్ల‌డించారు. కలాష్ హవేలియన్ గ్రామ శివార్లలో ఆదివారం సాయంత్రం పంజాబ్ పోలీసులతో కలిసి బీఎస్ ఎఫ్‌ దళాలు సోదాలు నిర్వహించాయని అధికారి తెలిపారు.


స‌రిహ‌ద్దులో గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతుండ‌గా, సగం కాలిన స్థితిలో 2.992 కిలోల బరువున్న మూడు చిన్న ప్యాకెట్ల‌ను గుర్తించిన‌ట్టు పేర్కొన్నారు. ప్యాకెట్ల‌ను ప‌రిశీలించ‌గా, నిషేధత‌ హెరాయిన్ సుమారు 3 కిలోలు, .30 ఎంఎం ఆయుధానికి చెందిన నాలుగు కాట్రిడ్జ్‌లు కూడా ఉన్న‌ట్టు వెల్ల‌డించారు. వాటిని స్వాధీనం చేసుకొని కేసు ద‌ర్యాప్తు జ‌రుపుతున్న‌ట్టు ఆయ‌న వివ‌రించారు.