Wedding | మ‌రికాసేప‌ట్లో పెళ్లి.. అక్క‌డే అస‌లు ట్విస్ట్‌.. వ‌రుడు అస‌లు అబ్బాయే కాదు..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (Uttar Pradesh) బారాబంకి (Barabanki)లో జ‌రుగుతున్న ఓ వివాహ వేడుక‌లో ఈ ఊహించ‌ని ట్విస్ట్ చోటు చేసుకుంది. వ‌రుడు అస‌లు మ‌గాడే కాద‌ని (transgender) తేలింది. ఇంకే ముందు పెళ్లికాస్తా పెటాకులైంది.

Wedding | గ్రాండ్ వెడ్డింగ్‌ (Wedding). బంధువులు, పిల్ల‌లు, చుట్టాల‌తో అక్క‌డ అంతా సంద‌డి వాతావ‌ర‌ణం. పెళ్లి మండ‌పంపై వ‌ధూవ‌రులు. పెళ్లి కార్య‌క్ర‌మాలు చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయి. ఊరేగింపు మ‌రింత‌ గ్రాండ్‌గా జ‌రిగింది. అంతా పెళ్లి హ‌డావుడిలో బిజీగా ఉన్నారు. మ‌రికాసేప‌ట్లో పెళ్లి తంతు. ఇంత‌లో ఊహించ‌ని ట్విస్ట్ జ‌రిగింది. వ‌రుడు అస‌లు మ‌గాడే కాద‌ని (transgender) తేలింది. ఇంకే ముందు పెళ్లికాస్తా పెటాకులైంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (Uttar Pradesh) బారాబంకి (Barabanki)లో ఈ ఊహించ‌ని ట్విస్ట్ చోటు చేసుకుంది. కోఠి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక గ్రామంలో వివాహం జరుగుతోంది. ఆరు నెలల క్రితమే వివాహం నిశ్చయమైంది. దీంతో ఫిబ్రవరి 13న పెళ్లి నిశ్చయించుకున్నారు. బంధువులు, అతిథులంతా వేడుక‌కు హాజరయ్యారు. ఆచారాల ప్ర‌కారం శుక్ర‌వారం రాత్రంతా కార్య‌క్ర‌మాలు కొన‌సాగాయి. తాళి క‌ట్ట‌డం ఒక్క‌టే త‌రువాయి. ఇంత‌లో వ‌రుడి గురించి వ‌ధువు కుటుంబానికి ఓ షాకింగ్ నిజం తెలిసింది. వ‌రుడు ట్రాన్స్‌జెండ‌ర్ (groom was transgender) అనే విష‌యం ఎవ‌రిద్వారానో బ‌య‌ట‌ప‌డింది.

దీంతో పెళ్లి మండ‌పం వ‌ద్ద ప‌రిస్థితులు ఒక్క‌సారిగా మారిపోయాయి. ఊహించ‌ని ఈ ప‌రిణామంతో వ‌రుడి ఫ్యామిలీ మెల్ల‌గా అక్క‌డి నుంచి జారుకునేందుకు ప్ర‌య‌త్నించింది. వ‌ధువు కుటుంబం వ‌రుడి త‌ల్లిదండ్రుల‌ను అడ్డ‌గించి ఈ విష‌యంపై అక్కడే నిల‌దీశారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసింది. దీంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేయాల్సి వ‌చ్చింది.

ఆచారం ప్రకారం గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకునే సమయంలో సాంప్రదాయ కళాకారుల బృందం వరుడు అబ్బాయి కాదని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇరువర్గాలకు సర్ది చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసినట్లు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌పై ఎలాంటి కేసూ న‌మోదు చేయ‌లేద‌న్నారు. ఈ వ్య‌వ‌హారం స్థానికంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి :

Cheetah | మూడు కూన‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన ‘గామిని’
Cheetah | మూడు కూన‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన ‘గామిని’

Latest News