TG EAPCET | రేపట్నుంచే టీజీ ఎప్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ.. అమ్మాయిలకు శుభవార్త..!
TG EAPCET | టీజీ ఎప్‌సెట్ దరఖాస్తుల ప్రక్రియ రేపట్నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు అర్హత గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈసారి అమ్మాయిలకు టీజీ ఎప్‌సెట్ కన్వీనర్ శుభవార్త వినిపించారు.

పరీక్షా కేంద్రాల విషయంలో అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కన్వీనర్ డాక్టర్ కే విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అమ్మాయిలు దరఖాస్తులో సూచించిన అడ్రస్‌కు సమీపంలోనే పరీక్షా కేంద్రాలను కేటాయిస్తామన్నారు. ఈసారి అమ్మాయిలు దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదన్నారు. ఒక జిల్లాలోని అమ్మాయిలకు ఇతర జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించబోమని స్పష్టం చేశారు.
రిజిస్ట్రేషన్ ఫీజు ఎంతంటే..?
ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు రూ. 900 కాగా, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ. 500గా నిర్ణయించారు. ఈసారి స్మార్ట్ ఫోన్‌లో దరఖాస్తు చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించామని కన్వీనర్ పేర్కొన్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు మే 4, 5 తేదీల్లో, ఇంజినీరింగ్ కోర్సుటకు మే 9, 10, 11 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram