ఛత్తీస్‌ఘడ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో వరుస ఎన్‌కౌంటర్లు నరమేధాన్ని తలపిస్తున్నాయి. గురువారం నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దులో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది

  • Publish Date - May 23, 2024 / 07:10 PM IST

విధాత: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో వరుస ఎన్‌కౌంటర్లు నరమేధాన్ని తలపిస్తున్నాయి. గురువారం నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దులో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరో 12మంది మావోయిస్టులకు గాయాలైనట్లుగా సమాచారం. పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

ఇంద్రావతి ఏరియా కమిటీ మావోయిస్టులకు, నారాయణపూర్, దంతెవాడ, బస్తర్ జిల్లాలకు చెందిన డీఆర్‌జీ, బస్తర్ ఫైటర్లతో పాటు ఎస్టీఎఫ్ బృందాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇప్పటికే 112మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా తెలుస్తుంది.

Latest News