Site icon vidhaatha

Boyfriend in Box | బాయ్ ఫ్రెండ్‌ను పెట్టెలో దాచిన ప్రియురాలు..! అర్ధ‌నగ్నత్వంలో ఉక్కిరిబిక్కిరి..!!

Boyfriend in Box | వారిద్ద‌రూ ప్రేమికులు( Lovers ). త‌న ప్రియురాలి( Girl Friend )ని చూడాల‌నిపించింది ప్రియుడికి( Boy friend ). ఇంకేముంది.. త‌న ల‌వ‌ర్( Lover ) కుటుంబ స‌భ్యుల క‌ళ్లుగ‌ప్పి అర్ధ‌రాత్రి వేళ ఆమె ఇంట్లోకి దూరాడు. ఓ గ‌ది( Room )లో ఇద్ద‌రూ ఏకాంతంగా ఉన్నారు. అయితే ఆమె కుటుంబ స‌భ్యుల‌కు( Family Members ) అనుమానం వ‌చ్చి.. ఆ గ‌ది వ‌ద్ద‌కు వెళ్లి త‌లుపు తీయాల‌ని ఆదేశించారు. అంత‌లోనే ప్రియుడ్ని.. ఇనుప పెట్టె( Iron Box )లో దాచి పెట్టింది తెలివిగ‌ల్ల ల‌వ‌ర్.

అయితే పెట్టె( Box )లో ఉన్న బ‌ట్ట‌లు( Clothes ) గ‌ది నిండా చెల్లాచెదురుగా ప‌డి ఉన్నాయి. దీంతో కుటుంబ స‌భ్యుల‌కు మ‌రింత అనుమానం వ‌చ్చింది. పెట్టె తెర‌వాల‌ని ఆమెతో గొడ‌వ‌కు దిగారు. తాను పెట్టె తెర‌వ‌నంటే తెర‌వ‌న‌ని ఆ యువ‌తి మొండికేసింది. ఫోన్‌లో రికార్డు( Record in Phone ) చేయ‌డం ఆపేస్తే పెట్టె తెరుస్తాన‌ని చెప్పింది. అయినా వారు వినిపించుకోలేదు. చేసేదేమీ లేక చివ‌ర‌కు పెట్టె తెరిచింది. అర్ధ‌న‌గ్నంగా ఉన్న ప్రియుడిని చూసి కుటుంబ స‌భ్యులు షాక్ అయ్యారు. ఇక అత‌డికి ఒళ్లంతా చెమ‌ట‌లు ప‌ట్టేశాయి. అత‌నిపై దాడి చేసేందుకు కుటుంబ స‌భ్యులు ప్ర‌య‌త్నించ‌గా, ప్రియురాలు అడ్డుప‌డింది.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియా( Social Media )లో వైర‌ల్ అవుతోంది. అయితే ఈ సంఘ‌ట‌న ఎక్క‌డ చోటు చేసుకుందనే విష‌యాలు మాత్రం తెలియ‌రాలేదు. అయితే ప్రియురాలికి, కుటుంబ స‌భ్యుల‌కు మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ చూస్తే ఒడియా( Odia ) భాషలో ఉంది. కాబ‌ట్టి ఆ ఘ‌ట‌న ఒడిశా( Odisha )లో చోటు చేసుకుని ఉండొచ్చ‌ని నెటిజ‌న్లు భావిస్తున్నారు. శృంగారం కోసం త‌మ ప్రాణాల‌ను సైతం ప‌ణంగా పెట్టేందుకు వెనుకాడ‌ని దేశం మ‌న‌ది అని ఓ నెటిజ‌న్ తీవ్రంగా స్పందించారు.

Exit mobile version