Murder | ఓ యువతి తన ప్రియుడితో అర్ధరాత్రి వేళ సరసాల్లో మునిగిపోయింది. మంచంపై ఏకాంతంగా ఉన్న వారిద్దరూ అమ్మమ్మకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇక విషయం బయటపడుతుందనే భయంతో అమ్మమ్మను మనుమరాలు తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. జలౌన్ జిల్లాకు చెందిన ఓ యువతి(21) గత కొంతకాలంగా దీపక్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. అయితే ఇటీవల యువతి ఇంటికి అర్ధరాత్రి వేళ ప్రియుడు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఏకాంతంగా ఓ గదిలో సరసాల్లో మునిగిపోయారు. ఆ గదిలో ఏవో శబ్దాలు వస్తున్నాయని గ్రహించిన అమ్మమ్మ.. అటుగా వెళ్లింది.
ఇద్దరూ రెడ్ హ్యాండెడ్‌గా అమ్మమ్మకు పట్టుబడ్డారు. అయితే తమ పరువు పోతుందనే భయంతో యువతి.. తన ప్రియుడితో కలిసి అమ్మమ్మ తలపై రాయితో మోదీ హత్య చేసింది. రక్తపు మడుగులో పడి ఉన్న అమ్మమ్మను చూసి తీవ్ర ఆందోళనకు గురైన ఆ యువతి.. ఓ నాటకం ఆడింది. దీపక్‌ను అటు నుంచి తప్పించి దొంగ దొంగ అని అరిచింది.
ఇక తెల్లారిన తర్వాత ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మొదట బుకాయించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె వ్యవహార శైలిపై పోలీసులకు అనుమానం కలిగింది. యువతిని తమదైన శైలిలో విచారించగా, తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు అంగీకరించింది. యువతిని అరెస్టు చేశారు. దీపక్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.