Site icon vidhaatha

Amit Shah : జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలా?

Amit Shah

30 రోజులు జైలులో ఉంటే రాజీనామా చేయాల్సిందే
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా

విధాత : పీఎం అయినా సీఎం అయినా జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలా?.. ఇది ప్రజాస్వామ్యానికి మర్యాదగా ఉండదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఇటీవల జైలుకు వెళ్లిన తర్వాత కూడా రాజీనామా చేయని ధోరణి కనిపిస్తోందన్నారు. సోమవారం ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 130 వ రాజ్యాంగ సవరణకు మద్ధతు తెలిపారు. దేశంలోని విపక్షాలు ఇప్పటికి కూడా జైలుకు వెళ్లినా సులభంగా పరిపాలన చేయొచ్చని భావిస్తున్నాయని విమర్శించారు. తమిళనాడు, ఢిల్లీలో మంత్రులు, సీఎం జైలుకు వెళ్లినా రాజీనామా చేయలేదు అని గుర్తు చేశారు. జైలుకు వెళ్లి.. అక్కడి నుంచే ప్రభుత్వాలు నడిపే పరిస్థితి మన దేశంలో రాకుడని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి గానీ, సీఎం అయినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఏ నేత అయినా జైలుకెళ్తే రాజీనామా చేయాల్సిందే అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఏదైనా కేసులో నాయకులు అరెస్టై జైలుకు వెళ్తే.. 30 రోజుల్లో బెయిల్ పొందాలని, లేదంటే తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. లేకపోతే చట్టమే వారిని తప్పించేలా 130వ రాజ్యాంగ సవరణను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలకు చట్టం ఒకే విధంగా అమలవుతుందన్నారు. ఈ నిబంధన ప్రధాన మంత్రి పదవి కూడా వర్తించేలా స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీయే దీన్ని సవరణలో ప్రతిపాదించినట్లు అమిత్ షా స్పష్టం చేశారు.

Exit mobile version