Delhi : ఆదివారం నుంచి ఢిల్లీలో రెండు రోజులు ఆల్ ఇండియా స్పీక‌ర్ల కాన్ఫ‌రెన్స్‌

ఆదివారం, సోమవారం ఢిల్లీలో రెండు రోజుల ఆల్ ఇండియా స్పీకర్ల కాన్ఫరెన్స్, అమిత్ షా, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా హాజరు.

All India Spekaers Conference Delhi

విధాత‌, న్యూఢిల్లీ: ఆలిండియా స్పీక‌ర్ల కాన్ఫ‌రెన్స్(All India Speakers Conference) ఢిల్లీలో రెండు రోజుల పాటు జ‌రుగ‌నున్న‌ది. ఆది,సోమ‌వారాల్లో రెండు రోజుల పాటు జ‌రిగే ఈ కాన్ఫ‌రెన్స్ ఢిల్లీలోరి(Delhi) అసెంబ్లీ భ‌వ‌నంలో నిర్వ‌హించానికి ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల పాటు జ‌రిగే కాన్ఫ‌రెన్స్‌న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ప్ర‌రంభించ‌నున్నారు. సోమ‌వారం ముగింపు కార్య‌క్ర‌మానికి లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా హాజ‌రు కానున్నారు. ఈ కాన్ఫరెన్స్ కు 32 మంది స్పీకర్లు, పలువురు డిప్యూటీ స్పీకర్లు, కౌన్సిల్ చైర్మన్ లు డిప్యూటీ చైర్మన్ లు హాజ‌రు కానున్నారు.

Latest News