Site icon vidhaatha

Sunita Williams | మళ్లీ ఆగిన సునీతా విలియమ్స్‌ రోదసి యాత్ర..

Sunita Williams : భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ రోదసీ యాత్ర మళ్లీ ఆగిపోయింది. బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌ క్యాప్సూల్‌లో రోదసీలోకి వ్యోమగాములు వెళ్లేందుకు ఉద్దేశించిన ప్రయోగం చివరి నిమిషంలో వాయిదాపడింది. అమెరికాలోని కేప్‌ కెనావెరల్‌ స్పేస్‌ ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న అట్లాస్‌ 5 రాకెట్‌ కౌంట్‌డౌన్‌ను ఇంకా మూడు నిమిషాల 50 సెకన్ల సమయం ఉందనగా ఆపేశారు.

కొన్ని సాంకేతిక కారణాలవల్ల సునీతా విలియమ్స్‌ రోదసి యాత్ర నిలిచిపోయిందని యునైటెడ్‌ లాంచ్‌ అలయన్స్‌ ఇంజనీర్‌ డిలియన్‌ రైస్‌ చెప్పారు. మరో వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌తో కలిసి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లాల్సి ఉంది. ఆదివారంలోగా మరోసారి ప్రయోగానికి ప్రయత్నిస్తామని రైస్‌ తెలిపారు. రోదసి మిషన్‌ ఆగిపోవడంతో క్యాప్సూల్‌లోని వ్యోమగాములు సునీత, విల్మోర్‌లను టెక్నీషియన్లు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

Exit mobile version