Punjab | న్యూఢిల్లీ : పంజాబ్‌లో భారతీయ జనతా పార్టీకి ఆ రాష్ట్ర ప్రజలు షాకిచ్చారు. రాష్ట్రంలో మొత్తం 13 స్థానాల్లో ఆ పార్టీ పోటీచేసిన ఒక్క చోట కూడా ఖాతా తెరవలేకపోయింది. ఏడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ మూడు స్థానాల్లో, స్వతంత్రులు రెండు స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నారు. శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో గెలుపొందింది. అమృత్ సర్, ఫతేగర్హ్ సాహిబ్, ఫీరోజ్‌పూర్, హోషియాపూర్, జలంధర్, లుధియానా, పాటియాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఆనంద్‌పూర్ సాహిబ్, సంగ్రూర్‌లో ఆప్ లీడింగ్‌లో ఉంది. భటిండాలో శిరోమణి అకాలీదల్ ముందంజలో ఉంది. ఖదూర్ సాహిబ్, ఫరీద్‌కోట్‌లో స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
జలంధర్ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీ బీజేపీ అభ్యర్థి సుశీల్ కుమార్ రింకూకు గట్టి పోటీ ఇస్తున్నారు. చరణ్‌జిత్ 78,981 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా లుధియానాలో గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు.