న్యూఢిల్లీ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ నిర్వహణలో ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకోలేక బీఎల్వో (BLO Suicide) టీచర్లు బలవన్మరణాలకు పాల్పడటం సంచలనంగా మారుతుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో సర్ (Special Intensive Revision) లక్ష్యాలను చేరుకోలేకపోతున్నానని సర్వేశ్ సింగ్(46) అనే బీఎల్వో(BLO)టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు. తన సూసైడ్ నోట్‌లో పని ఒత్తిడిని తట్టుకోలేక, అశాంతితో బాధపడుతున్నానని పేర్కొన్నారు. “నాకు బతకాలని ఉంది” అని ఆయన ఆత్మహత్యకు ముందు మాట్లాడిన సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది. గత కొన్ని వారాలుగా ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పనిఒత్తిడి పెరుగుతోందని, ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ తన పనిని పూర్తి చేయలేకపోతున్నానని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఆత్మహత్య చేసుకుంటున్నందుకు క్షమించాలని.. తన నలుగురు కుమార్తెలను జాగ్రత్తగా చూసుకోవాలని కుటుంబసభ్యులను కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కారణంగా బీఎల్వోల బలవన్మరణాలకు పాల్పడటాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇప్పటిదాక 14మంది బీఎల్వోలు ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సంఘం, బీజేపీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేసింది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ కొనసాగుతున్న రాష్ట్రాల్లో బూత్ స్థాయి (BLO) అధికారులు పనిఒత్తిడి కారణంగా అనారోగ్యానికి గురవడం, రాజీనామాలు చేస్తుండటం, పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చర్చనీయాంశమయ్యాయి.
Heartbreaking
A BLO died by suicide in UP. He recorded this video before taking the extreme step.
“Didi, forgive me, Mummy, please look after my children. I failed in this election work.”
This is another suicide in a series of suicides of BLOs. The ECI has blood on its hands pic.twitter.com/xk7xxNE02a
— Parth MN (@parthpunter) December 1, 2025
