TDP MPs | మోదీ కేబినెట్.. టీడీపీ ఎంపీల్లో ఆ న‌లుగురికి ఛాన్స్‌..! ఎవ‌రెవ‌రంటే..?

TDP MPs | దేశ రాజ‌కీయాల్లో కింగ్ మేక‌ర్‌గా మారిన టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మోదీ ఏ మేర ప్రాధాన్యం ఇవ్వ‌బోతున్నార‌ని స‌ర్వత్రా చ‌ర్చ న‌డుస్తోంది. 16 స్థానాల్లో గెలుపొంది.. మోదీకి బ‌ల‌మైన మ‌ద్ద‌తు అందించిన టీడీపీకి కేంద్ర కేబినెట్‌లో అత్య‌ధిక ప్రాధాన్య‌త ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

  • Publish Date - June 8, 2024 / 11:34 PM IST

TDP MPs  | న్యూఢిల్లీ : న‌రేంద్ర మోదీ వ‌రుసగా మూడోసారి ఈ నెల 9వ తేదీన సాయంత్రం ప్ర‌ధాన మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ఈ కార్య‌క్ర‌మానికి ఏర్పాట్లు చురుగ్గా కొన‌సాగుతున్నాయి. మోదీతో పాటు కొంద‌రు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేసే అవ‌కాశం ఉంది. అయితే మోదీ కేబినెట్ కూర్పుపై దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది.

దేశ రాజ‌కీయాల్లో కింగ్ మేక‌ర్‌గా మారిన టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మోదీ ఏ మేర ప్రాధాన్యం ఇవ్వ‌బోతున్నార‌ని స‌ర్వత్రా చ‌ర్చ న‌డుస్తోంది. 16 స్థానాల్లో గెలుపొంది.. మోదీకి బ‌ల‌మైన మ‌ద్ద‌తు అందించిన టీడీపీకి కేంద్ర కేబినెట్‌లో అత్య‌ధిక ప్రాధాన్య‌త ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే 16 ఎంపీల్లో న‌లుగురికి కేంద్ర మంత్రులుగా అవ‌కాశం ల‌భించ‌నున్న‌ట్లు స‌మాచారం.

రామ్మోహ‌న్ నాయుడు(శ్రీకాకుళం), హ‌రీష్ బాల‌యోగి(అమ‌లాపురం), ద‌గ్గుమ‌ళ్ల ప్ర‌సాద్(చిత్తూరు) ఆదివారం సాయంత్రం మోదీతో పాటు కేంద్ర మంత్రులుగా ప్ర‌మాణస్వీకారం చేసే అవ‌కాశం ఉంది. ఇక నాలుగో ఎంపీ ఎవ‌ర‌నే దానిపై స‌స్పెన్ష్ కొన‌సాగుతోంది. హ‌రీశ్ బాల‌యోగి, ద‌గ్గుమ‌ళ్ల ప్ర‌సాద్ ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. ఈ ముగ్గురికి కూడా అత్యంత ప్రాధాన్య‌త ఉన్న శాఖ‌ల‌ను కేటాయించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ‌, కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రితో పాటు పౌర విమాన‌యాన శాఖ కేటాయించనున్న‌ట్లు స‌మాచారం.

ఎన్డీయేలో బీజేపీ తర్వాత అత్యధికంగా 16 మంది ఎంపీలతో టీడీపీ రెండో స్థానంలో ఉంది. బీజేపీ నుంచి ముగ్గురు, జనసేన ఎంపీలు ఇద్దరు ఉన్నారు. కేంద్ర కేబినెట్‌లో భాగస్వామి అయ్యేందుకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కూడా సుముఖంగా ఉన్నారు. అంటే… రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలతోపాటు టీడీపీ, జనసేన సభ్యులకూ కేంద్ర కేబినెట్‌లో అవకాశం ద‌క్క‌నున్న‌ట్లు వార్త‌లు షికారు చేస్తున్నాయి.

Latest News