Doctor Shubhangi | సంచార జాతులు.. వీరికి ఒక స్థిరమైన నివాసం ఉండదు.. తినడానికి సరిగ్గా తిండి కూడా ఉండదు. బుక్కెడు బువ్వ కోసం.. గుక్కెడు నీళ్ల కోసం.. రోజంతా శ్రమించాల్సి ఉంటుంది. అలాంటి దయనీయమైన జాతి నుంచి ఓ యువతి తొలిసారిగా డాక్టర్( Woman Doctor ) పట్టా అందుకున్నారు. మరి డాక్టర్ శుభాంగి (Doctor Shubhangi ) విజయం.. ఆమె మాటల్లోనే విందాం..
నా పేరు శుభాంగి లోఖండే(Shubhangi Lokhande )(24). మాది మహారాష్ట్ర( Maharashtra )లోని అహిల్యానగర్ జిల్లాలోని లోని గ్రామం( Loni Village ). మాది వైదు కమ్యూనిటీ(Vaidu community ). నాన్న గ్రామాల్లో తిరుగుతూ ఇనుప సామాన్లు సేకరిస్తుంటాడు. అమ్మ.. మహిళలకు ఉపయోగపడే బొట్లు, సూదులు, చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువులు విక్రయిస్తూ గ్రామాల్లో తిరుగుతుంటుంది. నేను అమ్మ మాదిరి ఆ వృత్తిని ఎంచుకోలేదు. చదువుకుంటేనే భవిష్యత్ అని చెప్పే మా తాత మాటలు నా చెవుల్లో మార్మోగేవి. డాక్టర్ చదువు చదివి సమాజానికి సేవ చేయాలని తాత చెప్పేవారు. తాత మాటలు మనసులో బలంగా నాటుకుపోయాయి.
అనేక ఆర్థిక సమస్యలు ఎదురైనప్పటికీ.. వాటన్నింటిని అధిగమించాను. 10, 12వ తరగతిలో మంచి మార్కులు సాధించాను. ఇక ఉన్నత చదువులు చదవాలనే సంకల్పం కలిగింది. ఎలాగైనా తాత కలను నెరవేర్చాలని నిశ్చయించుకున్నాను. అమ్మనాన్నల అండతో హోమియోపతిలో డాక్టర్ పట్టా అందుకున్నాను.
డాక్టర్ విద్య పూర్తి కావడంతో అమ్మనాన్నలతో పాటు బంధువులు సంతోషంగా ఉన్నారు. మా కమ్యూనిటీకి, మా కుటుంబానికి ఇదో గర్వకారణం. మహారాష్ట్రలో వైదు కమ్యూనిటీలో డాక్టర్ పట్టా అందుకున్న తొలి యువతిని నేను కావడం గర్వంగా ఉంది. ఈ సక్సెస్ మా కమ్యూనిటీ విజయంగా భావిస్తున్నాను. ఎంతో మంది అమ్మాయిలకు వైద్య విద్య అభ్యసించేందుకు తోడ్పాటు అందిస్తాను. డాక్టర్‌గానే మిగిలిపోను.. మా సొసైటీలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తాను అని డాక్టర్ శుభాంగి చెప్పుకొచ్చారు.