Elephant | ఏనుగులు( Elephants ) శారీరకంగా దృఢంగా ఉంటాయి. ఏనుగులు చాలా వరకు జన సమూహాలకు నష్టం కలిగించే పనులే ఎక్కువగా చేస్తుంటాయి. పంటలను, నివాసాలను, వాహనాలను ధ్వంసం చేయడం, నడిరోడ్డుపై ఆగిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడం చూశాం. కానీ ఓ ఏనుగు మంచి పని చేసింది. క్రేన్( Crane ) చేయాల్సిన పని ఆ ఏనుగు( Elephant ) చేయడంతో దానిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
కేరళ( Kerala )లోని పాలక్కడ్ జిల్లాలోని తిరువేగప్పుర వద్ద ఉన్న నదిలో టయోటా ఫార్చునర్ కారు( Toyota Fortuner Car ) చిక్కుకుంది. ఇక నదిలో చిక్కుకున్న కారును బయటకు తీసేందుకు క్రేన్‌కు బదులుగా ఏనుగును ఉపయోగించారు. ఓ భారీ ఏనుగును నది వద్దకు తీసుకొచ్చారు. 2 వేల కిలోల బరువున్న కారుకు ఓ తాడును కట్టారు. అనంతరం ఆ తాడును ఏనుగుకు అందించారు. నిమిషాల వ్యవధిలో ఆ కారును ఏనుగు అమాంతం బయటకు లాగి పడేసింది.
2 వేల కిలోల బరువున్న టయోటా ఫార్చునర్ కారును నదిలో ప్రవహిస్తున్న నీటి నుంచి బయటకు లాగి ఏనుగు తన బలాన్ని ప్రదర్శించింది. క్రేన్ కంటే తానేం తక్కువ కాదని నిరూపించింది. కారును బయటకు లాగిన ఏనుగుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇన్‌స్టాలో వైరలవుతున్న ఈ వీడియోను 2 మిలియన్ల మంది వీక్షించగా, లక్ష మందికి పైగా లైక్ చేశారు.