EPFO | ఉద్యోగులకు శుభవార్త చెప్పిన EPFO..! వడ్డీ 8.15 శాతానికి పెంపు!

EPFO | ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) శుభవార్త చెప్పింది. ఉద్యోగుల భవిష్య నిధి నిల్వలపై వడ్డీ రేటును పెంచుతూ నిర్ణయించింది. మంగళవారం జరిగిన సమావేశంలో ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై 2022-23కి 8.15 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది. అయితే గ‌త ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కాస్త ఎక్కువ. మార్చి 2022లో వడ్డీ రేటును నాలుగు దశాబ్దాల కనిష్ఠానికి స్థాయి 8.1 శాతానికి తగ్గించింది. 2020-21లో ఇది 8.5 శాతంగా ఉండేది. తాజా నిర్ణయంతో […]

  • Publish Date - March 31, 2023 / 06:25 PM IST

EPFO | ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) శుభవార్త చెప్పింది. ఉద్యోగుల భవిష్య నిధి నిల్వలపై వడ్డీ రేటును పెంచుతూ నిర్ణయించింది. మంగళవారం జరిగిన సమావేశంలో ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై 2022-23కి 8.15 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది.

అయితే గ‌త ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కాస్త ఎక్కువ. మార్చి 2022లో వడ్డీ రేటును నాలుగు దశాబ్దాల కనిష్ఠానికి స్థాయి 8.1 శాతానికి తగ్గించింది. 2020-21లో ఇది 8.5 శాతంగా ఉండేది. తాజా నిర్ణయంతో దాదాపు ఐదు కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లకు లబ్ధి కలుగనున్నది.

ఉద్యోగుల భవిష్యనిధి అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) మంగళవారం జరిగిన సమావేశంలో 2022-23 సంవత్సరానికి ఈపీఎఫ్‌పై 8.15 శాతం వడ్డీని ఇవ్వాలని నిర్ణయించింది.

ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ పంపనున్నది. కేంద్రం ఆమోదం తర్వాత 2022-23 ఆర్తిక సంవత్సరానికి సంబంధించిన ఈపీఎఫ్‌ఓ డిపాజిట్లపై వడ్డీని వినియోగదారుల ఖాతాల్లో జమ చేయనున్నది.

Latest News