FAS Tag Annual Pass | ఆగస్టు 15నుంచి ఫాస్టాగ్ ఏడాది టోల్ పాస్

భారత ప్రభుత్వం ఫాస్టాగ్ ఆధారిత వార్షిక టోల్ పాస్‌ను ఆగస్టు 15న ప్రారంభిస్తోంది. రూ.3,000 చెల్లించి తీసుకునే ఈ పాస్‌తో 200 ట్రిప్స్ వరకు టోల్ చార్జీలు లేకుండా ప్రయాణించవచ్చు. ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్లకు మాత్రమే వర్తించనుండే ఈ పాస్, జాతీయ రహదారులపై మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

FAS Tag Annual Pass | విధాత: కేంద్ర ప్రభుత్వం టోల్ చార్జీల వసూళ్లలో తెచ్చిన సంస్కరణలలో భాగంగా రూ.3,000 ధరతో ఫాస్టాగ్( FASTag) వార్షిక పాస్‌ను ప్రారంభిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు15న ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ అందుబాటులోకి తేనుంది. యాక్టివేట్ చేసినప్పటి నుంచి సంవత్సరం పాటు లేదా 200 ట్రిప్స్ (ఏది ముందైతే అది వర్తిస్తుంది) చెల్లుబాటు అవుతుంది. వార్షిక ఫీజు చెల్లించి ఈ పాస్ తీసుకుంటే టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక ఫీజులేవీ చెల్లించకుండా సాఫీగా వెళ్లిపోవచ్చు.

అయితే ప్రస్తుతం ఫాస్టాగ్ కలిగిన వాహనదారులకే ఈ వార్షిక పాస్ తీసుకోవడానికి అర్హులు. రాజ్‌మార్గ్ యాత్రా మొబైల్ యాప్ లేక ఎన్ హెచ్ ఏఐ వెబ్ సైట్ లో వాహనం, ఫాస్టాగ్ నంబర్ వెరిఫికేషన్ తో పాస్ పొందవచ్చు. కమర్షియల్ వాహనాలకు ఈ ఫాస్టాగ్ పాస్ వర్తించదు. ప్రైవేట్ కారు, జీపు, వ్యాన్ వంటి వాణజ్యేతర వాహనాలకు మాత్రమే వార్షిక పాస్ ఇస్తారు. రాష్ట్ర రహదారులపై కాకుండా కేవలం జాతీయ రహదారులపై మాత్రమే ఇది పనిచేస్తుంది. ఒక వైపు ప్రయాణం ఒక ట్రిప్పుగా పరిగణిస్తారు.