FASTag | వన్‌ వెహికిల్‌.. వన్‌ ఫాస్టాగ్‌ అమలులోకి.. ఎన్‌హెచ్‌ఏఐ ఏమంటున్నదంటే..?

FASTag | నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) ‘వన్‌ వెహికిల్‌ - వన్‌ ఫాస్టాగ్‌’ రూల్‌ను అమలులోకి తీసుకువచ్చింది. ఇకపై ఒకే వాహనానికి చాలా ఫాస్టాగ్‌లు.. ఒకే ఫాస్టాగ్‌కు చాలా వాహనాలను నడిపేందుకు అనుమతి ఉండదని ఓ అధికారి తెలిపారు. ఒకే వాహనానికి ఒకే ఫాస్టాగ్‌ను లింక్‌ చేయడంతో దీని లక్ష్యమని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. పీఏటీఎం ఫాస్టాగ్‌ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా ఎన్‌హెచ్‌ఏఐ వన్‌ వెహికల్‌- వన్‌ ఫాస్టాగ్‌ గడువును మార్చి చివరి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఏప్రిల్‌ ఒకటి నుంచి బహుల ఫాస్టాగ్‌ల వినియోగం నిలిచిపోయింది. ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు, టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ విధానం తీసుకువచ్చినట్లు అధికారి పేర్కొన్నారు.

  • Publish Date - April 2, 2024 / 07:30 AM IST

FASTag | నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) ‘వన్‌ వెహికిల్‌ – వన్‌ ఫాస్టాగ్‌’ రూల్‌ను అమలులోకి తీసుకువచ్చింది. ఇకపై ఒకే వాహనానికి చాలా ఫాస్టాగ్‌లు.. ఒకే ఫాస్టాగ్‌కు చాలా వాహనాలను నడిపేందుకు అనుమతి ఉండదని ఓ అధికారి తెలిపారు. ఒకే వాహనానికి ఒకే ఫాస్టాగ్‌ను లింక్‌ చేయడంతో దీని లక్ష్యమని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. పీఏటీఎం ఫాస్టాగ్‌ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా ఎన్‌హెచ్‌ఏఐ వన్‌ వెహికల్‌- వన్‌ ఫాస్టాగ్‌ గడువును మార్చి చివరి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఏప్రిల్‌ ఒకటి నుంచి బహుల ఫాస్టాగ్‌ల వినియోగం నిలిచిపోయింది. ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు, టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ విధానం తీసుకువచ్చినట్లు అధికారి పేర్కొన్నారు.

గత నెలలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) వినియోగదారులతో పాటు వ్యాపారులు తమ ఖాతాలను మార్చి 15 లోపు ఇతర బ్యాంకులకు మార్చుకోవాలని సూచించింది. ఫాస్ట్‌ట్యాగ్ అనేది భారతదేశంలోని ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ, ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించబతున్నది. దాదాపు 98శాతం పెనట్రేషన్ రేటు, 8కోట్ల మంది వినియోగదారులతో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్‌లో ఎన్‌హెచ్‌ఏఐ ఫాస్టాగ్‌తో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. ఈ విధానంలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా టోల్‌ చెల్లింపులు జరుగుతాయి. టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ స్టిక్కర్‌ను స్కాన్‌ చేసిన సమయంలో ఫాస్టాగ్‌ అకౌంట్‌ నుంచి కట్‌ అవుతుంది. ఇక ఫాస్టాగ్‌ను వాహనానికి అమర్చే విషయంలో నిబంధనలను గతంలోనే ఎన్‌హెచ్‌ఏ ప్రకటించింది. ఫాస్టాగ్‌ స్టిక్కర్‌ను వాహనం ముందుభాగంలో పెట్టాలని అధికారులు సూచించారు.

Latest News