Site icon vidhaatha

Firing | నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఇంటి దగ్గర కాల్పుల కలకలం..!

Firing : బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సల్మాన్‌ ఖాన్ ఇంటి దగ్గర కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బంద్రా ఏరియాలోగల గెలాక్సీ అపార్టుమెంట్స్‌లో సల్మాన్‌ ఖాన్‌ నివాసం ఉంటున్నారు. ఈ తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఆ అపార్టుమెంట్‌ బయట నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైకుపై వచ్చి కాల్పులకు పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు.

కాగా స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్‌ నిపుణులు సైతం ఘటనా ప్రాంతానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Exit mobile version