Election results | సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు షురూ.. ప్రధాని కుర్చీ మళ్లీ మోదీకేనా.. ఏపీ, ఒడిశాల్లో పట్టం ఎవరికో..!

Election results | సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. గుజరాత్‌లో సూరత్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మిగిలిన 542 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దేశవ్యాప్తంగా 10.50 లక్షల కౌంటింగ్ కేంద్రాల్లో ఈ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర ఎన్నికల సంఘం మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది.

  • Publish Date - June 4, 2024 / 08:09 AM IST

Election results : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. గుజరాత్‌లో సూరత్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మిగిలిన 542 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దేశవ్యాప్తంగా 10.50 లక్షల కౌంటింగ్ కేంద్రాల్లో ఈ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర ఎన్నికల సంఘం మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. రాష్ట్రంలో మొత్తం 34 ప్రాంతాల్లో 44 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్స్‌‌‌‌ వచ్చాయి. 139 కౌంటింగ్ హాల్స్‌లో ఈవీఎంల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కౌంటింగ్ కోసం 14 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు.

లోక్ సభ ఎన్నికల మొదటి ఫలితం ఉదయం 11-12 గంటల మధ్య రానుంది. చొప్పదండి, యాకుత్‌‌‌‌పురా, దేవరకొండలో అత్యధికంగా 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు, ఆర్మూర్, భద్రాచలం, అశ్వారావుపేటలో అత్యల్పంగా 13 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలతోపాటే ఇవాళ ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. ఏపీలో కొవ్వూరు, నరసాపురం శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు మొదట విడుదల కానున్నాయి. ఈ రెండు స్థానాల్లో 13 రౌండ్లలోనే ఫలితం తేలిపోతుంది. భీమిలి, పాణ్యం నియోజకవర్గాల ఫలితాలు ఆలస్యంగా రానున్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు 26 రౌండ్లలో జరుగనుంది.

ఏపీలోని లోకసభ నియోజకవర్గాల్లో రాజమహేంద్రవరం, నరసాపురం స్థానాల ఫలితాలు తొలుత వస్తాయి. ఈ స్థానాల్లో 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తవుతుంది. అయితే, అమలాపురం లోకసభ స్థానం ఫలితం అన్నింటికంటే ఆలస్యం అవుతుంది. ఇక్కడ అత్యధికంగా 27 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. ఇక్కడ కౌంటింగ్‌కు 9 నుంచి 10 గంటల సమయం పడుతుంది.

ఎగ్జిట్‌ పోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్‌ ఖాయమని స్పష్టం కావడంతో ప్రధాని కుర్చీ మళ్లీ మోదీకే దక్కే అవకాశం ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు తప్పయితే మాత్రం ఇండియా కూటమికే అధికారం దక్కనుంది. అటు ఏపీ, ఒడిశాల్లో కూడా అధికార వైసీసీ, బీజేడీ తమ ప్రభుత్వాలను నిలుపుకుంటాయా.. లేదంటే ఓటమి చవిచూస్తాయా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.

Latest News