Viral Video : యువతి సాహసం..నృత్యం చేస్తూనే 554 ఆలయ మెట్ల అధిరోహణం

హంపిలోని ఆంజనేయాద్రి కొండపై 554మెట్లను నృత్యం చేస్తూ కేవలం 8 నిమిషాల్లో ఎక్కిన యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను ఆకట్టుకుంది.

విధాత : దైవం పట్ల భక్తిప్రపత్తులను చాటుతూ ఓ యువతి నృత్యం చేస్తూ.. కేవలం 8 నిమిషాల 54 సెకన్లలో ఆలయం 554మెట్లను అధిరోహించిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కర్ణాటక రాష్ట్రం హంపిలోని అంజనేయుడి జన్మస్థలంగా భావించే ఆంజనేయాద్రి కొండపైకి సాంప్రదాయ భరత నాట్యం చేస్తూ..ఓ యువతి 554మెట్లను కేవలం 8నిమిషాలలో 54సెకన్లలో ఎక్కింది. ఆలయంలో శ్రీరాముడు, ఆంజనేయ స్వామి పవిత్ర పాదాల వద్ద తన ప్రదర్శనను సమర్పించి.. నాట్య కళాంజలి అర్పించింది. అంకితభావం, దైవం పట్ల శ్రద్ధాసక్తులు ఆ యువతి సాహస లక్ష్యాన్ని చేరుకునేలా చేశాయి. ఆంజనేయ ఆలయం మెట్లను ఎక్కడం..దాదాపుగా 40 అంతస్తులను ఎక్కడంతో సమానం అని..నాట్యం చేస్తూ ఆలయం మెట్లు ఎక్కి పైకి చేరుకోవడం నిజంగా అభినందనీయమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Srikanth Chary : శ్రీకాంత్ చారి వర్ధంతి జరుపుకొనివ్వడం లేదు: తల్లి శంకరమ్మ
Illegal Loan Apps : అనధికార లోన్ యాప్స్ కు కేంద్రం షాక్..87యాప్స్ పై నిషేధం

Latest News