Site icon vidhaatha

GST : జీఎస్టీ తగ్గింపులపై కౌన్సిల్ కీలక భేటీ!

gst-council-meeting-tax-reduction

న్యూఢిల్లీ : ఇటీవల ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చేసిన హామీ మేరకు జీఎస్టీ శ్లాబ్ లను సరళీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో భాగంగా శుక్రవారం న్యూఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి 8 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. జీఎస్టీ రేట్ల సవరణ, అనంతర ప్రభావంపై చర్చించారు. రాష్ట్ర ఆదాయాలను కాపాడుతూ జీఎస్టీ హేతుబద్ధీకరణ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం జీఎస్‌టీ పరిధిలో 5, 12, 18, 28 శాతం పన్నులు అమల్లో ఉన్నాయి. కేంద్రం 5, 18 శాతం జీఎస్టీ శ్లాబ్‌లను మాత్రమే ఉంచాలని యోచిస్తున్నట్లు తెలిపింది. పలు వస్తువులు, సేవల రేట్లను తగ్గించాలనుకుంటున్నట్లుగా కేంద్రం వివరించింది. దీనిపై చర్చించేందుకు సెప్టెంబర్ 3, 4 తేదీల్లో 56వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.

కేంద్రం ప్రతిపాదించిన ఐదు శాతం పన్ను పరిధిలోకి హోటల్ గదుల అద్దెలు, 100 రూపాయల సినిమా టికెట్లు, బ్యూటీ సర్వీసెస్ ఉంటాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. వ్యవసాయానికి ఉపయోగపడే ఎరువులు, మైక్రోన్యూట్రియెంట్స్, డ్రిప్ ఇరిగేషన్, ట్రాక్టర్లపై జీఎస్‌టీ, టెక్స్‌టైల్‌, హ్యాండీక్రాఫ్ట్స్, సింథటిక్ యార్న్, కార్పెట్స్, టెర్రకోటా వస్తువులు, కొన్ని రకాల ఫుట్‌వేర్స్ లను 5శాతం జీఎస్టీ శ్లాబ్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. విద్యకు ఉపయోగపడే మ్యాప్స్, అట్లాసులు, షార్పెనర్లు, పెన్సిల్స్, క్రేయాన్స్, ఎక్సర్‌సైజ్ బుక్స్‌పై 5శాతం జీఎస్టీ విధించే అవకాశముంది. వాటర్ ఫ్యూరిఫైడ్ లు 18శాతం నుంచి 5శాతంలోకి రావచ్చు., మెడికల్ ఆక్సిజన్, అయోడిన్, పొటాషియం ఐయోడేట్ 12శాతం నుంచి 5శాతానికి చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రీమియం ఎయిర్ టికెట్లు 18శాతం శ్లాబులో ఉండనున్నాయి. గ్యాంబ్లింగ్, క్యాసినో, బెట్టింగ్, ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు, రేస్ క్లబ్‌లపై 40 శాతం పన్ను విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. 30 క్యాన్సర్ చికిత్సలో వాడే మందులు, అరుదైన వ్యాధుల ఔషధాలు పూర్తిగా టాక్స్ ఫ్రీ శ్లాబ్‌లో ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Exit mobile version