Helicopter Crash In France | విధాత : అడవిలో విస్తరిస్తున్న కార్చిచ్చును ఆర్పేందుకు సరస్సు నుంచి నీటిని మోసుకెలుతున్న ఓ హెలికాప్టర్ అనుహ్యంగా అదే నీటిలో కుప్ప కూలింది. ఫ్రాన్స్‌లో అడవిలో రేగిన మంటలను అదుపు చేసేందుకు ఓ సరస్సు నుంచి నీటిని తీసుకెళ్లే క్రమంలో రెస్క్యూ హెలికాప్టర్ సరస్సులోనే కుప్ప కూలిన ఘటన ఫ్రాన్స్ లో చోటుచేసుకుంది. హెలికాప్టర్ కు వెలాడిదీసిన బకెట్ ను నీటితో నింపేందుకు పైలట్ సరస్సు నీటి మీదకు వెళ్లాడు. బకెట్ ను నీటిలో ముంచే క్రమంలో హెలికాప్టర్ ను అదుపు చేయడంలో పైలట్ విఫలమయ్యాడు. దీంతో హెలికాప్టర్ నీటిని తాకడంతో క్రాష్ కు గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
పైలట్ బకెట్ నింపడానికి సరస్సు లోకి చాలా వేగంగా కిందకు దిగడంతోనే చాపర్ తోక భాగం నీటిలో మునిగిపోయి క్రాష్ అయ్యినట్లుగా కనిపిస్తుంది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ లోని పైలట్, సహా మరో వ్యక్తి సురక్షితంగా బయటపడి ఒడ్డుకు చేరుకోగలిగారు. చిత్రంగా అదే హెలికాప్టర్ పైలట్ అంతకుముందు ఇదే సరస్సు నుంచి 27ట్రిప్పుల నీళ్లను మోసకెళ్లి 28వ ప్రయత్నంలో అందులోనే కూలిపోవడం గమనార్హం.
