High Speed Rail : 2026 మార్చి నాటికి.. రైల్వే హైస్పీడ్ టెస్ట్ ట్రాక్ రెడీ

భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. రాజస్థాన్‌లో రూ.967 కోట్లతో నిర్మిస్తున్న దేశపు తొలి హైస్పీడ్ టెస్ట్ ట్రాక్ 2026 మార్చి నాటికి అందుబాటులోకి రానుంది. ఇక్కడ రైళ్లు గంటకు 220 కి.మీ వేగంతో ప్రయోగాత్మకంగా పరుగెత్తనున్నాయి.

high-speed test track

హై స్పీడ్ రైళ్ల టెస్టింగ్ కోసం ప్రత్యేకంగా ట్రాక్ ను నిర్మాణం చేస్తున్నారు. ఈ పనులు పూర్తయితే వచ్చే ఏడాది మార్చి తరువాత టెస్టింగ్ ట్రాక్ లో రైళ్లు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనున్నాయి. రాజస్థాన్ లోని జోధ్ పూర్ డివిజన్ లో గుడా స్టేషన్ నుంచి తథానా మిథ్రి స్టేషన్ వరకు ఉన్న 70 కిలోమీటర్ల ట్రాక్ పై రైళ్లు తిరగనున్నాయి. రీసెర్చి డైజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) రూ.967 కోట్లతో ట్రాక్ నిర్మాణ పనులు చేపట్టింది. ఈ ప్రాజెక్టు నార్త్ వెస్టర్న్ రైల్వే పరిధిలోకి వస్తున్నది.

నార్త్ వెస్టర్న్ రైల్వే సీపీఆర్ఓ శశి కిరణ్ మాట్లాడుతూ, మొత్తం 64 కిలోమీటర్ల ట్రాక్ కాగా ఇప్పటికే 57 కిలోమీటర్ల వరకు పనులు పూర్తయ్యాయని అన్నారు. మార్చి 2026 నాటికి పనులు పూర్తవుతాయన్నారు. ఈ ట్రాక్ లో మొత్తం ఏడు భారీ బ్రిడ్జీలు, 129 చిన్న బ్రిడ్జీలు ఉండగా, గుడా, జబ్డినగర్, నవాన్, మిథాడి స్టేషన్లు ఉన్నాయి. భారతీయ రైల్వేలు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేకంగా టెస్టింగ్ ట్రాక్ నిర్మాణం చేస్తున్నారన్నారు. గరిష్టంగా ఒక గంట సమయంలో 220 కిలోమీటర్లు పరుగెత్తేలా ఈ ట్రాక్ ను సిద్ధం చేస్తున్నారని ఆయన తెలిపారు. పనులు పూర్తయిన తరువాత ఈ ట్రాక్ లపై హైస్పీడ్ రైళ్లు, బుల్లెట్ ట్రైన్లు, మెట్రో ట్రైన్లు, సెమీ హై స్పీడ్ ట్రైన్లను పరీక్షించనున్నారు. ట్రాక్ పొడవునా అనేక మలుపులు ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాలలో వేగంగా ట్రైన్లను ఎలా నడపాలనే దానిపై ఆర్డీఎస్ఓ ట్రాక్ లను డిజైన్ చేసింది. ప్రమాదాలు జరగకుండా, పూర్తిగా సురక్షితంగా నడపడం కోసం మలుపులు ఏర్పాటు చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాలలో ఇలాంటి టెస్టింగ్ ట్రాక్ లను భారతీయ రైల్వే ఉన్నతాధికారులు పరిశీలించి, అధ్యయనం చేసిన తరువాత రాజస్థాన్ లోని వెస్టర్న్ రైల్వే పరిధిలో నూతన ట్రాక్ ను నిర్మిస్తున్నారు.

అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు 416 కిలోమీటర్ల పొడవునా చేపట్టిన హైస్పీడ్ రైలు ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇప్పటికే 409 కిలోమీటర్ల పొడవునా పిల్లర్లు, 345 కిలోమీటర్ల వరకు గిడ్డర్ల ఏర్పాట్ల పనులు పూర్తయ్యాయి. 132 కిలోమీటర్ల వరకు ట్రాక్ కన్ స్ట్రక్షన్, 88 కిలోమీటర్ల దూరం వరకు ఓవర్ హెడ్ పనులు పూర్తి చేశారు. ముంబై, థానే, విరార్, బోయిసర్, వాపి, బిల్మోరా, సూరత్, బరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్ మీదుగా సబర్మతి వరకు మొత్తం 12 స్టేషన్లలో బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టనున్నది.

ఇవి కూడా చదవండి :

Krishna Pending Projects | కృష్ణా జలాల వాటాలపై బీఆరెస్‌, కాంగ్రెస్‌ షాడో ఫైటింగ్! ప్రాజెక్టులు మాత్రం పెండింగ్‌!
Ravi Babu | వెరైటీ టైటిల్‌తో ర‌విబాబు కొత్త సినిమా.. గ్లింప్స్‌తో మైండ్ బ్లాక్ చేసేశాడుగా..!

Latest News