ప్లాన్ ప్రకారం అక్కడ జరగాల్సింది ఆ డాక్టర్ హత్య మాత్రమే. కానీ, హత్యకు కారణమేంటనే అనవసరపు ఆలోచనలు ఎవరికీ రాకుండా, రేప్ – మర్డర్ అనబడే నేరంగా మార్చేందుకు అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. అసలు కారణం, డ్రగ్ మాఫియా. అధికార తృణమూల్ కాంగ్రెస్ అండదండలతో ఆ హాస్పిటల్లో నడుస్తున్నమాదకద్రవ్యాల దందా. అందుకే ఓ మహిళ అయ్యుండీ, ముఖ్యమంత్రి ఈ ఘోరంపై సరైన రీతిలో స్పందించలేదు.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, కోల్‌కతా(RG Kar Medical College and Hospital, Kolkata) – ఓ అత్యంత కిరాతకానికి మూగసాక్షిగా మిగిలిపోయింది. అలా చాలా విషయాలకు ఆ ఆసుపత్రి మూగసాక్షే. 29 ఏళ్ల ఒక పీజీ రెండవ సంవత్సరపు జూనియర్ వైద్యురాలు (Junior Doctor)అర్థరాత్రి జరిగిన దారుణ దమనకాండకు బలైపోయింది. కారణం, తను సాక్ష్యంగా నిలిచిన మాదకద్రవ్యాల దందా. ఆసుపత్రిలో యధేచ్ఛగా తిరుగుతున్న డ్రగ్ మాఫియా(Drug Mafia), వైద్య విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తూ, దాన్ని ఓ అడ్డాగా మార్చుకున్నారు. అధికారపార్టీ నేత(Trinamul Congress Leaders)ల కనుసన్నలలో నడుస్తున్న ఈ వ్యాపారాన్ని అడ్డుకునే ధైర్యం ఎవరికీ లేకపోయింది.
అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం, బలైన వైద్య విద్యార్థిని ఈ డ్రగ్ దందాను (Eyewitness for Drug deal) కళ్లారా చూసినట్లు, అందుకే తనను అంతమొందించేందుకు పథకం ప్రకారమే ఈ హత్య జరిగినట్లు తెలిసింది. కేవలం హత్యే చేసి ఊరుకుంటే, ఒక సాధారణ జూనియర్ డాక్టర్‌ను చంపాల్సిన అవసరమేముందనే సందేహాలు మొదలై, అనవసరమైన విచారణకు దారితీసి, తుదకు తమదాకా చేరుకుంటుందనే భయంతో, అప్పటికప్పుడు పథకంలో మార్పు చేసి అత్యాచారానికి ఒడిగట్టారు. అప్పుడు రేప్ అనేదే ప్రధానంగా కనబడుతుంది. అందులో భాగంగానే హత్య జరిగుంటుందని అందరూ అనుకోవాలనేదే మాఫియా పథకం. నిజానికి వారి ప్లాన్‌లో అత్యాచారం లేదు. ఈ విషయమంతా హాస్పిటల్ సిబ్బందికి, విద్యార్థులకు బాగా తెలుసని తెలుస్తోంది. ఆ అమ్మాయికి ఆ రోజు నైట్ డ్యూటీ వేయడం, రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడా ప్లేస్ లేకుండా చేయడంవల్ల, తప్పనిసరి పరిస్థితుల్లో తను సెమినార్ హాల్లోనే పడుకోవడం అంతా పథకంలో భాగమే – Planned Murder along with Rape.
జరిగిన ఘోరంలో ప్రధాన పాత్రధారి సంజయ్ రాయ్ (Sanjoy Roy) అనబడే ఓ పోలీస్ వలంటీర్. పోలీసు ఉన్నతాధికారులతో ఉన్న సన్నిహిత సంబంధాలు అతన్ని కోల్‌కతా పోలీస్ సంక్షేమ బోర్డులోకి తీసుకోవడానికి ఉపకరించాయి. దానిద్వారానే అతను ఈ ప్రభుత్వ వైద్య కళాశాల పోలీస్ ఔట్‌పోస్టులోకి రాగలిగాడు. కోలకతా పోలీస్ 4వ బెటాలియన్(Kokata Police 4th Battalion)లో విస్తృతమైన స్వేచ్ఛ కలిగిన సంజయ్ రాయ్ హాస్పిటల్ అంతా విచ్చలవిడిగా తిరిగేవాడు. అతనికి ఎదురుతిరిగే దమ్మెవరికీ లేదు. ఆ కాలేజీలో డ్రగ్స్ దందాకు అధినేత ఈ సంజయే. జరిగిన ఘోరంలో ప్రత్యక్షంగా పాల్గొంది కూడా ఇతనేనని ఆసుపత్రి సిబ్బంది, పేరు చెప్పడానికి ఇష్టపడని దర్యాప్తు చేస్తున్న ఓ అధికారి తెలిపారు. ఈ సంజయ్ అనేవాడికి లేని దురలవాట్లు లేవు. భార్యలను విపరీతంగా వేధించేవాడని, నిత్యం పోర్న్ చిత్రాలను మొబైల్లో చూసేవాడని తెలుస్తోంది. తన స్వయంగా మాదకద్రవ్యాలకు బానిస కూడా(Sanjoy roy is a drug addict). ఈ దారుణం తర్వాత సంజయ్ రాయ్ కోలకతా పోలీస్ 4వ బెటాలియన్‌లోని బ్యారక్‌లోనే పడుకున్నాడని ఆ అధికారి తెలిపారు.
ఇందులో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ (Dr. Sandeep Ghosh) ప్రమేయం కూడా ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మొదట్లో తను అమ్మాయిదే తప్పు అని వాదిస్తూ, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసాడు. ఈ సందీప్ అనే డాక్టర్ చరిత్ర కూడా అంతా అవినీతి, నేరమయమే. డాక్టరే అయిన తన భార్య రెండు వారాల బాలింతగా ఉన్నప్పుడు, కడుపులో తంతే, ఆమె ప్రాణాపాయస్థితిలోకి వెళ్లింది. ఇరుగుపొరుగు వారు హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఆమెను కాపాడారు. అధికార తృణమూల్‌తో గట్టి సంబంధాలున్న సందీప్, గతంలో జరిగిన తన రెండు బదిలీలను సమర్థవంతంగా అడ్డుకుని 48 గంటలలోపే తిరిగి అక్కడే జాయినయ్యాడు. ఇప్పుడు కూడా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్‌గా తప్పించి హైకోర్టు, లీవ్‌లో వెళ్లాల్సిందిగా ఆదేశించినా, వెంటనే మరో కాలేజీకి ప్రిన్సిపాల్‌గా నియమితుడయ్యడంటేనే తన పలుకుబడి(highly influential in Trinamul Cogress) ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సంజయ్ రాయ్, సందీప్ ఘోష్.. ఇద్దరూ తోడుదొంగలే. తిరిగి వేరే కళాశాలకు నియమితుడయ్యడన్న విషయం తెలుసుకున్న కోల్‌కతా హైకోర్టు(Kolkata High Court), ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, తిరిగి ఇంట్లో కూర్చోబెట్టింది. కేసును సిబిఐకి బదిలీ (Transferred to CBI)చేసింది.
ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. ఇండియన్ మెడకల్ అసోసియేషన్ (IMA)వైద్యసేవల నిలుపుదలకు పిలుపునిచ్చింది. ప్రతీ రాష్ట్రంలోని వైద్య విద్యార్థులు, ఆందోళనలతో ఆసుపత్రులను వణికిస్తున్నారు. ఇప్పుడు సిబిఐ అయినా ఈ ఘోరం వెనుక ఉన్న నిజాలను బయటికితీసి అసలు దోషులను, డ్రగ్ మాఫియాను అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.