King Cobra vs Hens | నాగుపాము( King Cobra ) ఈ పేరు వింటేనే ఒళ్లంతా చెమటలు పట్టి హడలెత్తిపోతుంటాం. కానీ అలాంటి నాగుపాముకు ఓ రెండు కోళ్లు( Hens ) చుక్కలు చూపించాయి. నడిరోడ్డుపై పడగవిప్పి బుసలు కొడుతున్న ఆ నాగుపామును వెంటాడి, వేటాడి చంపేశాయి.
బీహార్( Bihar )లోని రామ్‌నగర్( Ramnagar ) ప్రాంతానికి చెందిన ఓ ఏరియాలోని రోడ్డుపై పిల్ల నాగుపాము( King Cobra ) ప్రత్యక్షమైంది. ఆ పిల్ల నాగుపాము నడిరోడ్డుపై బుసలు కొడుతూ.. అందర్నీ భయభ్రాంతులకు గురి చేసింది. అంతేకాదు పడగవిప్పి కూర్చుంది. ఇక అటుగా వెళ్తున్న ఓ రెండు కోళ్లు.. నాగుపామును చూశాయి.
ఇంకేముంది.. ఆ పిల్ల నాగుపామును రెండు కోళ్లు టార్గెట్ చేశాయి. పడగవిప్పిన నాగుపాముపై ఒకదాని తర్వాత ఒకటి కోళ్లు దాడి చేశాయి. పాము కూడా కోళ్లను కాటేసేందుకు యత్నించింది. కానీ కోళ్లు కూడా అదేస్థాయిలో తమ ముక్కుతో నాగుపామును విచక్షణారహితంగా పొడిచాయి. నాగుపామును తమ నోటితో కరుచుకుని సజీవంగా తినేశాయి కోళ్లు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో( Social Media ) తెగ వైరల్ అవుతుంది.
ఇక కోళ్ల ధైర్యంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాగుపామును కోళ్లు చంపేయడంపై వాటి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. కోళ్ల ముందు నాగుపాము నిస్సహాయ స్థితిలో ఉండిపోయిందని కామెంట్లు పెడుతున్నారు.