LoK Sabha elections | కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. 300కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఎన్డీఏ..

LoK Sabha elections | దేశంలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఎగ్జిట్‌ పోల్స్‌ తెలిపినట్టుగానే అధికార ఎన్డీఏ కూటమే గెలుపు దిశగా వెళ్తోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు, తొలి రౌండ్ ఫలితాలు వెల్లడయ్యేటప్పటికి బీజేపీ 300కుపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. వారణాసిలో ప్రధాని మోదీ, వాయనాడ్‌లో రాహుల్‌గాందీ, మహారాష్ట్రలోని అమరావతిలో నవనీత్‌కౌర్‌, మధ్యప్రదేశ్‌లోని గుణలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • Publish Date - June 4, 2024 / 09:52 AM IST

LoK Sabha elections : దేశంలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఎగ్జిట్‌ పోల్స్‌ తెలిపినట్టుగానే అధికార ఎన్డీఏ కూటమే గెలుపు దిశగా వెళ్తోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు, తొలి రౌండ్ ఫలితాలు వెల్లడయ్యేటప్పటికి బీజేపీ 300కుపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. అందులో బీజేపీ సొంతంగా 200 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. వారణాసిలో ప్రధాని మోదీ, మహారాష్ట్రలోని అమరావతిలో నవనీత్‌కౌర్‌, మధ్యప్రదేశ్‌లోని గుణలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

గుజరాత్‌లోని సూరత్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మిగిలిన 542 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దేశవ్యాప్తంగా 10.50 లక్షల కౌంటింగ్ కేంద్రాల్లో ఇప్పుడు ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర ఎన్నికల సంఘం మూడంచెల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, ఉదయం 8.30 గంటలకు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలైంది.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే ప్రతిపక్ష ఇండియా కూటమి 200ల లోపే స్థానాలకు పరిమితమైంది. ఆ కూటమి 200 కంటే తక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా 80కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. వాయనాడ్‌లో రాహుల్‌గాంధీ ఆధిక్యంలోఉన్నారు. అధికార, ప్రతిపక్ష కూటముల్లో లేని ఇతర పార్టీలు దాదాపు 60 స్థానాలకు అటుఇటుగా ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. దాంతో ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్‌ విజయం ఖాయమని ఎర్లీ ట్రెండ్స్‌ స్పష్టం చేస్తున్నాయి.

Latest News