విధాత : ఒకరిది అంధభక్తి నిర్వాకం..మరొకరిది భుక్తి కోసం ఆరాటం. ఆచారం..విశ్వాసాల పేరుతో ఓ భక్తుడు చేసిన చర్య తీవ్ర విమర్శల పాలైంది. ‘దుగ్ధాభిషేకం’ పేరుతో ఓ భక్తుడు గంగానది జలాల్లో పాలాభిషేకం నిర్వహించాడు. అదే సమయంలో నది తీరంలో ఉన్న పేద వర్గాల పిల్లలు పాల కోసం పరుగెత్తుకు వచ్చారు. నీళ్లలో పారబోస్తున్న పాలను తమకు దానంగా పోయాలంటూ పేద బాలికలు పాత్రలు పట్టుకుని అభ్యర్థించారు. అయితే ఆ భక్తుడు ఆ పేద పిల్లల ఆకలి మాటలు పట్టించకుకోండా తను చేయదలుచుకున్న పాలాభిషేకం తంతు మేరకు పిల్లలకు పాలు దక్కకుండా వారికి దూరంగా జరిగి మరీ.. నదిలో పాలను పారబోశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.
ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆచారాల పేరిట ఆహారాన్ని వృథా చేయడం కంటే, ఆకలితో ఉన్న పిల్లలకు అందించడమే నిజమైన భక్తి అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మానవత్వం లేని భక్తి వల్ల ప్రయోజనం లేదని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు..మానవత్వం లేని భక్తి పాడే మీదున్న శవంతో సమానం అని, మెట్ల దగ్గర ఆకలితో ఉన్నవాడిని వదిలేసి గుడిలో దేవుడికి నైవేద్యం కొబ్బరికాయ, కానుకలు ఎంత ఇచ్చినా వృధానే అని ఇది సనాతన ధర్మాన్ని సరిగా అర్ధం చేసుకోని మూఢ భక్తుల అమానవీయ చర్య అని విమర్శలు గుప్పిస్తున్నారు.
గంగానదిలో పాలు పోస్తూ ‘దుగ్ధాభిషేకం’ చేస్తున్న ఒక భక్తుడు, పక్కనే పాత్రలతో నిలబడిన పేద పిల్లలకు పాలు దక్కకుండా పక్కకు జరిగి మరీ నదిలో పోస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆచారాల పేరిట ఆహారాన్ని వృథా చేయడం కంటే, ఆకలితో ఉన్న… pic.twitter.com/57DCNSs88f
— ChotaNews App (@ChotaNewsApp) January 22, 2026
ఇవి కూడా చదవండి :
Telangana AI Data Center | భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్
286 kg Golden Bow Gifted To Ayodhya Ram | ఆయోధ్య రాముడికి అరుదైన ‘పంచలోహ ‘విల్లు’
