Maoist Letter : హిడ్మాను పట్టుకునే మట్టుబెట్టారు: మావోయిస్టుల మరో లేఖ

హిడ్మాను పట్టుకుని ఎన్‌కౌంటర్‌లో చంపేశారని మావోయిస్టులు కొత్త లేఖలో ఆరోపించారు. శంకర్‌ సహా పలువురిని నకిలీ ఎన్‌కౌంటర్లలో హతం చేశారంటూ విచారణ డిమాండ్ చేశారు.

Maoist Letter

విధాత: మావోయిస్టు అగ్రనేత హిడ్మాను పోలీసులు పట్టుకునే మట్టుబెట్టారని మావోయిస్టు పార్టీ మరోసారి ఆరోపించింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హిడ్మా ఎన్ కౌంటర్ కు సంబంధించి మావోయిస్టు పార్టీ రెండో లేఖను విడుదల చేసింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరిట ఈ లేఖ విడుదలైంది. హిడ్మా(మారెడుమిల్లి), శంకర్ (రంపచోడవరం)లను ఎన్ కౌంటర్ చేయలేదని, పట్టుకుని కాల్చి చంపి..ఎన్ కౌంటర్ కట్టుకథ అల్లారని ఆరోపించింది.

ఆక్టోబర్ 27న వైద్య చికిత్స కోసం ఏపీకి చెందిన ఓ కలప వ్యాపారితో విజయవాడకు వెళ్లిన హిడ్మ, ఐదుగురు సహచరులను పోలీసులు నిరాయుధులుగా పట్టుకుని..వారం రోజులు చిత్రహింసలు పెట్టి చంపేశారని వికల్ప్ తన లేఖలో వెల్లడించాడు. అలాటే శంకర్ ను, అతని సహచరులు ఆరుగురిని కూడా పట్టుకుని నకిలీ ఎన్ కౌంటర్ లో చంపారని ఆరోపించారు. ఈ రెండు సంఘటనల్లోనూ వారిని అడవి నుంచి తీసుకెళ్లిన వ్యక్తులు పోలీస్ ఇన్ఫాఫార్మర్లు అని అర్ధమైందన్నారు. కోసల్ కమిటీకి చెందిన ఓ సభ్యుడు తెలంగాణ పోలీసులకు అందించిన సమాచారంతో వారి హత్య జరిగిందని, అలాగే మరో 50మందిని అరెస్టు చేశారని వికల్ప్ తన లేఖలో పేర్కొన్నాడు. హిడ్మా, శంకర్ ల బృందాన్ని ఎంతగా హింసించిన వారు దేవ్ జీ(మల్లా రాజిరెడ్డి) సమాచారం వెల్లడించలేదన్నారు. మల్లా రాజిరెడ్డి అరెస్టు కాలేదని తెలిపారు. హిడ్మాను సమాచారం తెలుసుకున్నాకే..చత్తీస్ గఢ్ డిప్యూటీ సీఎం విజయశర్మ హిడ్మా తల్లితో లొంగుబాటు పిలుపు నాటకం వేశాడని వికల్ప్ అరెస్టు చేశారు. హిడ్మా, శంకర్ ల ఎన్ కౌంటర్లపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి :

Naga Chaitanya- Sobhita : నాగ చైతన్యతో పెళ్లికి ఏడాది..శోభిత స్పెషల్ వీడియో వైరల్
Kavitha : ఎనిమిదేళ్లుగా ఉప్పల్ ఫ్లై ఓవర్ పనులు: కవిత విసుర్లు

Latest News