న్యూఢిల్లీ: బీజేపీ సాధారణ మెజార్టీకి అవసరమైన సీట్లను గెలుచుకోని కారణంగా మనుగడ కోసం మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అనేక ప్రయాసలకోర్చాల్సి ఉంటుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికకు ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాత భారతదేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. భారత రాజకీయ వ్యవస్థలో ఖాళీ ఒక్కసారిగా విస్ఫోటం చెందిందని అన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అద్భుతమైన పనితీరు ప్రదర్శించి, ఎగ్జిట్ పోల్ ఫలితాలను పటాపంచలు చేస్తూ 234 స్థానాలు కైవసం చేసుకున్నది. ఎన్డీయే కూటమికి 293 సీట్లు వచ్చాయి. ‘సంఖ్యలు ఎంత దుర్బలంగా ఉన్నాయంటే.. చిన్న ఇబ్బంది ఎదురైనా, ఒక భాగస్వామ్య పార్టీ నిష్క్రమించినా ప్రభుత్వం పడిపోతుంది’ అని ఆయన చెప్పారు. ‘మీరు విద్వేషాన్ని వ్యాప్తి చేయొచ్చు.. వైషమ్యాలను వ్యాప్తి చేయొచ్చు.. దాని నుంచి ఫలితాలు కూడా పొందొచ్చు. కానీ.. భారతదేశ ప్రజలు ఈ ఎన్నికల్లో ఆ ఆలోచనను తిరస్కరించారు’ అని అన్నారు. అందుకే సంకీర్ణ ప్రభుత్వం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పారు. 2014, 2019 ఎన్నికల్లో మోదీకి కలిసొచ్చినవి ఈసారి పనిచేయలేదని అన్నారు.
చిన్న ఇబ్బంది ఎదురైనా ఎన్డీయే ప్రభుత్వ పతనం : రాహుల్‌గాంధీ
బీజేపీ సాధారణ మెజార్టీకి అవసరమైన సీట్లను గెలుచుకోని కారణంగా మనుగడ కోసం మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అనేక ప్రయాసలకోర్చాల్సి ఉంటుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

Latest News
శ్రీ సమ్మక్క సారలమ్మ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు
వైభవంగా బీహార్ లో ప్రపంచ భారీ మహాశివలింగం ప్రతిష్టాపనోత్సవం
నల్లగొండ కార్పోరేషన్ తొలి మేయర్ పీఠం కాంగ్రెస్ దే: మంత్రి కోమటిరెడ్డి
‘మన శంకరవరప్రసాద్ గారు’లో మెరిసిన కొత్త ముఖం ఎవరు?
‘స్త్రీలకే కాదు..తమిళనాడులో పురుషులకు కూడా ఫ్రీ బస్సు స్కీమ్’
సంక్రాంతి అల్లుడికి 1,116వంటకాలతో విందు
మున్సిపల్ చైర్మన్లు..మేయర్ల రిజర్వేషన్ల ప్రకటన
మావోయిస్టు అగ్రనేత పాపారావు ఎన్ కౌంటర్
సియెరా వర్సెస్ మహీంద్రా ఎక్స్ యూవీ..అమ్మకాలలో కొత్త రికార్డ్సు!
రైలు టికెట్ ధర మా ఇష్టం అడగానికి మీరెవరు.. ఇది ట్రేడ్ సీక్రెట్