Site icon vidhaatha

Rahul Gandhi | ఎర్రకోట వేడుకల్లో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అరుదైన రికార్డు

పదేళ్ల తర్వాతా వేడుకలకు హాజైన ప్రతిపక్ష నేత

స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day Celebrations) సందర్భంగా కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అరుదైన ఘనత సాధించారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort) వద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తొలి ప్రతిపక్ష నేతగా చరిత్ర సృష్టించారు. ఎర్రకోట వద్ద నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రతిపక్ష హోదాలో రాహుల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెల్లని కుర్తా ధరించి ఒలింపిక్‌  (Olympic) పతక విజేతలతో కలిసి కూర్చుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ పదేళ్ల తర్వాత స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న తొలి ప్రతిపక్ష నేతగా రికార్డులకెక్కారు.

గత కొన్నేళ్లుగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత (LoP) హోదా పొందేందుకు అవసరమైన స్థానాలు ఏ రాజకీయ పార్టీ సాధించలేదకపోయింది. దీంతో 2014 నుంచి 2024 వరకూ ప్రతిపక్ష నేత పదవి ఖాళీగానే ఉంది. ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలం పుంజుకుని 99 స్థానాలు గెలుచుకుంది. దీంతో లోక్‌సభలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. ఈ క్రమంలో లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీ ఎన్నికయ్యారు. ఈ హోదాలోనే ఇవాళ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని.. పదేళ్ల తర్వాత ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న తొలి ప్రతిపక్ష నేతగా రాహుల్‌ నిలిచారు.

Exit mobile version