విధాత, హైదరాబాద్ : గుజరాత్‌లో గేమింగ్ జోన్‌లో శనివారం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 32మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవకముందే ఇదే రోజు అర్ధరాత్రి దేశ రాజధాని ఢిల్లీలో శిశు సంరక్షణ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు దిల్లీ ప్రాంతం వివేక్ విహార్‌లో ఉన్న శిశు సంరక్షణ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి చికిత్స అందుతోంది. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తెచ్చారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
also read :
గుజరాత్ గేమ్ జోన్ అగ్ని ప్రమాదంలో 32కు చేరిన మృతుల సంఖ్య